home page

త్రిపుర కొత్త సీఎం మాణిక్ సాహా

తృణమూల్ కాంగ్రెస్ బలపడుతున్న దాఖలాలు

 | 
Manik saha

పార్టలో చేరిన నాలుగేళ్లకే అధ్యక్షుడైన సాహా

త్రిపుర ముఖ్యమంత్రి గా మాణిక్ సాహా ఆదివారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నారాయణ్ ఆర్యా కొత్త మంత్రులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో కీలక పాత్ర పోషించిన సాహా త్రిపుర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా వున్నారు. సాహా రాజ్యసభ సభ్యుడు.

2018లో త్రిపుర లో సిపిఎం పార్టీ ని ఓడించి అధికారంలోకి వచ్చిన బిజెపి బిపలవ్ దేబ్ ను ముఖ్య మంత్రి గా నియమించింది. అతని పనితీరుపై నెగెటివ్ ప్రభావం లేకపోయినా తృణమూల్ కాంగ్రెస్ బలపడుతున్న దాఖలాలు కనిపించడంతో అప్రమత్తమైన బిజెపి అధిష్టానం హఠాత్తుగా ముఖ్యమంత్రి దేబ్ చేత శనివారం రాజీనామా చేయించి, ఆ వెంటనే దేబ్ ఇంట్లో నే శాసనసభాపక్ష నేతగా సాహాను ఎన్నుకున్నారు. ఆదివారం కొత్త ముఖ్యమంత్రిగా సాహా ప్రమాణం చేశారు.