home page

మసీదుల వద్ద లౌడు స్పీకర్లు తొలగించాలి

మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి డిమాండ్ 

 | 
Loud speakers

fb-iconwhatsapp-icontwitter-icon

 

 

మసీదుల వద్ద లౌడ్‌ స్పీకర్లను నిషేధించరా?

రెట్టింపు శబ్దంతో హనుమాన్‌ చాలీసా వినిపిస్తాం: ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ 

ముంబై, మసీదు వద్ద అక్రమ లౌడ్‌స్పీకర్లను నిషేధించకుంటే అక్కడ హనుమాన్‌ చాలీసాను రెట్టింపు శబ్దంతో వినిపిస్తామని  మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సమితి (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే  మహారాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించారు. మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లను తొలగించేంతవరకు తమ కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తునే ఉంటారని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తూ శబ్దకాలుష్యానికి కారణమైన లౌడ్‌స్పీకర్లను మసీదుల వద్ద నిషేధించాల్సిందేనని ఆయన బుధవారం మీడియా సమావేశంలో మరోసారి డిమాండ్‌ చేశారు. మసీదులతోపాటు చాలావరకు ఆలయాల్లోనూ భారీ లౌడ్‌స్పీకర్లను వినియోగిస్తున్నారన్న ఆయన.. లౌడ్‌స్పీకర్ల అంశం మతపరమైంది కాదని, అదొక సామాజిక అంశమని పునరుద్ఘాటించారు.

ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం సుప్రీం నిబంధనలు ఉల్లంఘించి లౌడ్‌స్పీకర్లను వినియోగించాయని.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ఠాక్రే ప్రశ్నించారు. 45-55 డెసిబల్స్‌కు మించకుండా లౌడ్‌ స్పీకర్లను వినియోగించవచ్చన్న సుప్రీం నిబంధనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ముంబైలోని చార్కోప్‌ ప్రాంతంలోని మసీదు వద్ద ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు కొందరు హనుమాన్‌ చాలీసాను లౌడ్‌ స్పీకర్లలో  వినిపించారు.hatsapp-icon image widgethatsapp-icon image widget