home page

లైవ్ లో సుప్రీం కోర్టు విచారణ

ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు  

 | 
Supreme court

*న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*

_*సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!*_

*సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది.*

*- రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్​లో లైవ్​లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం.*

*- త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.*

★ సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 

★ రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. 

 _★ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్​లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు.. త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది._ 

 _★కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు._ 

 _★ లైవ్​ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు._ 

 _★https://main.sci.gov.in/display- board*లేదా_ _https://webcast.gov.in/scindia/* లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి.__

 *★ ఈడబ్ల్యూఎస్​ కోటా; దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్​ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.**