home page

కమలనాధులకు కేజ్రీవాల్ చెక్

అసెంబ్లీలో బలపరీక్ష కు సిద్ధమైన కేజ్రివాల్

 | 
Kajreewal
పార్టీ పట్ల, తన పట్ల ఎమ్మెల్యేలందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన అసెంబ్లిలో ధీమాగా చెప్పారు. తన పట్ల ఎమ్మెల్యేలంతా విధేయతగా ఉన్నారన్న వాస్తవాన్ని రుజువు చేసేందుకే ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక విధంగా ఇది ప్రధాని మోడీకి విసిరిన సవాల్‌ వంటిదే. అసెంబ్లిలో సోమవారం నాడు ఆయన చేసిన ప్రసంగంలో కమలనాథుల తీరును ఎండగట్టారు.

ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను పడగొట్టేందుకు అనుచిత మార్గా లను కమలనాథులు అనుసరిస్తున్నారని ఆరోపించారు. నిజానికి బీజేపీ సభ్యులే ఈ రోజు కేజ్రీవాల్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలనుకున్నారు. ఈ విషయాన్ని ముందుగా ఊహించి కేజ్రీవాల్‌ తమప్రభుత్వంపై శాసనసభ విశ్వాసాన్ని కోరారు. ఎంతో నమ్మకం, ధైర్యం ఉంటే తప్ప ఏ ముఖ్యమంత్రీ తన ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోరరు.

ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులకే ఇది సాధ్యం. ఈ విశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. సభలో సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి, చివరగా తాను సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ, ముందే ఆయన తన ప్రసంగం రూపంలో సమాధానమిచ్చారు.

బీజేపీ దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వాలను పడగొట్టిన తీరును ఆయన సోదాహరణగావివరించారు. నిజానికి అసెంబ్లిలో కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలన్నీ సభ వెలుపల చేసినవే. ఇంత కన్నా ఘాటుగా బీజేపీని సీరియల్‌ కిల్లర్‌గా పోలు స్తూ ఆరోపణ చేశారు.ఆయన మాదిరిగా తాను ముందే పసిగట్టలేకపోవడం వల్లనే అధికారాన్ని కోల్పోయానని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే అన్నారు. దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం కన్నా తీవ్రమైనది.

అప్పట్లో కాంగ్రెస్‌ ఎమ్మెలలకు పదవులు ఎరచూపేది. అలా కొంత మంది తిరుగుబాటు దారులను ముఖ్యమం త్రులుగా చేసింది కూడా. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ప్రభుత్వా న్ని పడగొట్టేందుకు బీజేపీ అదే మాదిరి ఎత్తుగడను అను సరించింది. ఆనాడు కాంగ్రెస్‌ అనుసరించిన పద్దతులనే ఈనాడు బీజేపీ అనుసరిస్తోంది.

ప్రభుత్వాలను పడగొ టేందుకు కాంగ్రెస్‌ రాజ్యాంగంలోని 356వ అధికరణా న్ని దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ, దాని మాతృ క అయిన భారతీయ జనసంఘ్‌ తరచూ ఆరోపించేవి. జనతాపార్టీ హయాంలో 356వ అధికరణ దుర్వినియో గం కాకుండా చూసేందుకు రాజ్యాంగ సవరణను తెచ్చే ట్టు ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే, ఇప్పుడు బీజేపీ అదే మార్గంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొడుతున్న తీరు పైైె ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. బీజేపీ ఇంతవరకూ ఎన్ని ప్రభుత్వాలను పడగొట్టిందీ కేజ్రీవాల్‌ ఏకరవు పెట్టారు.

అవినీతి ఆరోపణలను ఎత్తి చూపి జార్ఖండ్‌లో ముఖ్య మంత్రి హేమంత్‌ సొరేన్‌ను గద్దె దింపేందుకు కమలనా థులు రంగాన్ని సిద్ధం చేశారు. సొరేన్‌ని శాసనసభ్యునిగా అనర్హునిగా ప్రకటించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవల్సి ఉంది. పశ్చి మ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వాస పాత్రమైన పార్ధూ చటర్జీని ఈడీ అధికారులు జైలుకి పంపారు. మరో మంత్రిపై కూడా విచారణ జరు గుతోంది.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిధుల కేటాయిం పు విషయంలో ప్రశ్నిస్తున్నందుకే తమ ప్రభుత్వాలపై కత్తిని కేంద్రం వేలాడదీస్తోందని ప్రతిపక్ష సిఎంలు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆరోపించారు. ఈ సిఎం లు అందరితో కేజ్రీవాల్‌ సమావేశాలను ఏర్పాటు చేయడం, ఆతిధ్యం ఇస్తున్నందుకే ఆయనపై పగ సాధిస్తున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దేశంలోని బీజేపీ యేతర ముఖ్యమంత్రులంతా అభద్రతా భావంతో పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రధాని మోడీకి తెలిసే జరుగుతోందా ? లేక తెలియకుండా జరుగుతోందా అనేది అలా ఉంచితే, ఆయన ఇమేజ్‌కి మాత్రం ఇది మంచిది కాదన్నది రాజకీ య పరిశీలకుల అభిప్రాయం. కేజ్రీవాల్‌ తరచుగా కేంద్రంపై విరుచుకుపడుతుండడం వల్లే ఆయనపై గురి పెట్టారన్నది కూడా వారి అభిప్రాయం.