home page

ఢిల్లీలో కేసిఆర్ టూర్ఎఫెక్ట్

తగ్గే అవకాశం ఉన్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు

 | 
Kcr

ముఖ్యమంత్రి #కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం
పెట్రోల్, డీజిల్ ధరల పైన కేంద్రంలోని బీజేపీ వెనక్కి తగ్గడం
అంతా ఒక అద్భుతం 

అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది?
ప్రధానిగా మోడీ చేయలేని ఎన్నో పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి చూపించారు...తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు... మరో వైపు భారత్ - చైనా సరిహద్ధులో జరిగిన గాల్వాన్ ఘటనలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించి వారికి స్వయంగా అందజేశారు... అలాగే రైతు నల్ల చట్టాలపై నిరసనగా కేంద్రంలోని బీజేపీతో శాంతియుతంగా పోరాడుతూ మరణించిన రైతుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగారు కేసీఆర్ గారు

మరో వైపు కేంద్రం వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రెస్మీట్ లు పెట్టి ఎండగట్టారు...రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ లో ధర్నాకు దిగారు కేసీఆర్... కేసీఆర్ ఉగ్రరూపం చుసిన కేంద్రం వ్యవసాయ చట్టాల పైన వెనక్కి తగ్గుతూ ప్రకటన చేసింది...ఇది కేంద్రం మీద కేసీఆర్ గారు సాధించిన తొలి విజయం 

ఆ తరువాత రాష్ట్రాల పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని ఏండగట్టారు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తున్న కేంద్రం యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టాడు...దీంతో బీజేపీ ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేసీఆర్ గారికి ఆకర్షితులు అయ్యారు... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోరిక మేరకు స్వయంగా పర్యటించారు...కేసీఆర్ గారి మార్గంలో పయనించడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు 

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్ గారు ...అనేక మంది మేధావులు, జాతీయ నాయకులు ఢిల్లీలోని కేసీఆర్ గారి నివాసానికి క్యూ కడుతుండటంతో కేంద్రంలోని అధికార బీజేపీ కి గుబులు మొదలయింది...కేసీఆర్ గారు పెద్ద ఫిటింగ్ ఏదో పెట్టబోతున్నాడని అర్థం చేసుకున్న బీజేపీ ఆగమేఘాల మీద  పెట్రోల్, డీజిల్ మీద ధరలు తగ్గిస్తూ ప్రకటన వెలువరించింది

ఏది ఏమైనా జాతీయ స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన హాట్ టాపిక్... అసలు ఏం చేస్తున్నడు... ఏం చేయబోతున్నాడు అంటూ జాతీయ మీడియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది...మొత్తంగా కేసీఆర్ గారి ద్వారా దేశానికి ఏదో మంచి జరగబోతుంది అని నా మనుసు బలంగా నమ్ముతుంది