home page

అభివృద్ధితో పాటు పర్యావరణం ముఖ్యమే కదా: సుప్రీం కోర్టు

హైకోర్టు ఆదేశాలకు లోబడి నిర్మాణం చేయాలి

 | 
Supreme court

హైకోర్టుకు వెళ్లే అవకాశం పిటీషనర్  రఘురామ కు ఉంది

అభివృద్ధితో పాటు పర్యావరణం కూడా ముఖ్యమే
కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
అభివృద్ధి ఎంత ముఖ్యమో.... భావితరాల అవసరాల దృష్ట్యా
పర్యావరణం కూడా
 అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రిషికొండ నిర్మాణాలపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ప్రస్తుతానికైతే సుప్రీం కోర్టు ఎత్తివేస్తూ, పాక్షిక స్టేను ఇచ్చిందన్నారు. రేపు సాక్షి దినపత్రికలో, మరికొన్ని ఛానళ్లలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించే అవకాశం ఉందన్నారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీ ద్వారా వాస్తవం వెళ్లడ వుతుందన్నారు. రిషికొండ విధ్వంసంపై స్థానిక ప్రకృతి ప్రేమికులు వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నదని, తనను దానిలో ఇంప్లీడ్ కావాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. రిషి కొండ పై గతంలో నిర్మాణాలు ఉండి కూల్చి వేసిన చోట చిన్నచిన్న నిర్మాణాలు చేపట్టాలని, చెట్టు కొమ్మల మధ్య నుంచి కనిపించే విధంగా, ఆదివాసుల ఇళ్ళ నిర్మాణం తరహాలో నిర్మాణాలకు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే, చదునుగా ఉన్న ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలకు అవకాశాన్ని కల్పించిందన్నారు. చదునుగా ఉన్న ప్రాంతం అంటే నిజంగా చదునుగా ఉన్న ప్రాంతం లో మాత్రమేనని, రుషికొండ కు గుండు కొట్టినట్లు, తవ్వే సిన చోట కాదన్నారు. రిషికొండ ప్రకృతి విధ్వంసం పై , హైకోర్టు తానుదాఖలు చేయనున్న పిటిషన్ లో సమగ్రంగా వివరాలన్నీ పొందుపరుస్తానని తెలిపారు. విశాఖ లో ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారని వారు కూడా తాజాగా పిటిషన్లు దాఖలు చేయవచ్చునని సుప్రీం కోర్టు సూచించిందన్నారు.. ఎన్ జీ టి ఇచ్చిన స్టే రాష్ట్రప్రభుత్వం రద్దు చేయించుకొని, సుప్రీంకోర్టు నుంచి కండిషన్ లతో కూడిన స్టే ను పొందిందనీ తెలిపారు. రిషి కొండ విద్వంసం పరిశీలించడానికి 
హైకోర్టు కమిటీని ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేస్తూ, రిషి కొండ పై కేవలం 136 చెట్ల నరికివేతకు అనుమతిస్తే, వేల చెట్లను నరికి వేశారన్నారు. కోస్టల్ జోన్ వన్ టూ 200 లోపే ఈ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు . కోస్టల్ జోన్ పరిధిలోకి కనీస ఎక్విప్మెంట్ కూడా తీసుకు వెళ్ళడానికి వీల్లేదని కానీ అక్కడే దారుణమైన విధ్వంసాన్ని చేశారన్నారు. . కళ్ళెదురుగుండా కొట్టేసిన కొండ కనిపిస్తుంటే, తాను కొండను కొట్టి వేయలేదని ఇంకా
ఎంతో కాలం న్యాయస్థానాన్ని తప్పు దారి పట్టించలేరన్నారు. రిషి కొండ విధ్వంస వాస్తవాలను స్థానికులు కోర్టుకు నివేదించాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయానికి కట్టుకునే పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని సూచించారు.. ఇంకా కూడా తాను న్యాయస్థానాలను నమ్మించగలనని భావిస్తే, నిజాలు చెప్పడానికి విశాఖ వాసులంతా రెడీగా ఉన్నారు కాబట్టి... ఇకపై రిషికొండ కు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఇప్పటికే జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము కాబట్టి, వృక్ష సంపదను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 
నూతన టెండర్ విధానం గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి
డబ్బులు ఇచ్చినప్పు డే తీసుకోవాలన్న విధానం ఏ దేశ చరిత్ర లోనూ లేదని, గిల్లితే గిల్లించు కోవాలి అన్నట్లు గా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. డబ్బులు ఇవ్వకపోయినా కోర్టుకు వెళ్లడానికి వీల్లేదంటూ నూతన టెండర్ విధానంలో నిబంధనలు విధించడం చూస్తుంటే దీని వెనుక ఏదైనా మతలబు ఉన్నదా అన్న అనుమానం కలగక మానదన్నారు. తమకు కావలసిన వారికి కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు, ఔట్ ఆఫ్ ద వే బిల్లులు చెల్లించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.. సాక్షి దినపత్రికకు వ్యాపార ప్రకటనల బిల్లులు ఇచ్చినంత వేగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రముఖ దినపత్రికలు ఇవ్వడం లేదని, సాక్షి దిన పత్రికకు ఇచ్చినట్లుగా తమకు బిల్లులు చెల్లించాలని ఎవరు కోర్టుకు వెళ్ళవద్దనే ఈ నిబంధనలు తీసుకువవచ్చినట్లు కనిపిస్తోందన్నారు.. అసలే లక్షా యాభైవేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాం కాబట్టి, అందరు కోర్టుకు వెళ్లేందుకు వీలులేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇంత నిర్భయంగా, నిర్లజ్జగా నేను డబ్బులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, కోర్టుకు వెళ్లడానికి వీల్లేదన్న టెండర్ సృష్టికర్తలను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించాలన్నారు. ప్రపంచంలో ఏ దేశం, మనదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రకమైన నిర్ణయం తీసుకోలేదని, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి తన అభిశంసన లు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగ అప్పుల పై దర్యాప్తు జరుగుతోందని, దానికి పరాకాష్ట అన్నట్లుగా కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి చేసిన అప్పుల పూర్తి వివరాల నివేదికలు అందజేయాలని డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేఖ రాసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని , రాష్ట్ర ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల రుణ పరిమితి కోరిందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 28 వేల కోట్ల రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటికే మే మాసంలో పదివేల కోట్ల రుణాలను పొందారన్నారు. ఈ లెక్కన అప్పులు చేస్తే రెండు నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వ రుణ పరిమితిని దాటి పోతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అసలు అప్పుల ఊబిలో నుంచి ఎప్పుడు బయట పడతమన్న ఆందోళన ఒకవైపు వేధిస్తుంటే, విశాఖ రిషి కొండ పై 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టూరిజం ప్రాజెక్టు పేరిట భవన నిర్మాణాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఏముందని ప్రశ్నించారు. కేవలం పది కోట్ల టెండర్ కే డబ్బులు ఇవ్వలేమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టూరిజం ప్రాజెక్టు పేరిట భవనాలను నిర్మించడం అవసరమా అంటూ నిలదీశారు. 
పోలీసులు సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదు
సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ని ఉద్దేశించే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గుడ్డలూడదీసి తన్నుతాను అంటే పోలీసులు సుమోటోగా కేసు ని ఎందుకు నమోదు చేయలేదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న ఎవరో ఒకరు మెసేజ్ పెడితే, స్వదేశంలో ఉన్న మరో ఎవరో దాన్ని ఫార్వర్డ్ చేస్తే విశాఖలో ఉన్న కిషోర్ ను కర్నూలు కి తీసుకువెళ్లి కరోనా బారిన పడి మృత్యువాతకు కారణమైన పోలీసులు, ఈ విషయంలో అంత వేగంగా ఎందుకు స్పందించలేదని డి జి పి రాజేంద్ర నాథ్ రెడ్డి ని ప్రశ్నించారు. ఇటీవలనే ఒక ఎమ్మెల్సీ దళితుని హత్యచేసి డోర్ డెలివరీ చేశారని, ఇప్పుడు మరొక ఎమ్మెల్సీ నడిరోడ్డుపై రాష్ట్రస్థాయి నాయకు డు నీ పట్టుకొని గుడ్డలూడదీసి తంతానని అన్న పోలీసులు కనీస చర్యలు తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుంద న్నారు.. ఒక ఎస్సీ నీ ఒక ఎమ్మెల్సీ చంపగా, మరొక బీసీ ని ఇంకొక ఎమ్మెల్సీ తంతా నని అంటున్నారని, తమ పార్టీకి ఓట్లు వేసే ఎస్సీ, బీసీలను తప్ప ఇతరులను బతకనీయ్యరా అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. సామాజిక న్యాయం లో ఒక సామాజిక వర్గానికి కీలక పదవులు, మిగిలిన సామాజిక వర్గాలకు అధికారం లేని పదవులను కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఇక కార్పొరేషన్ పదవుల్లోనూ కీలక పదవులను రెడ్డి సామాజిక వర్గ నేతలకు అప్పగించి, పనికిరాని కార్పొరేషన్ పదవులను ఎస్సి బిసి నేతలకు అప్పగించారన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగాలు కూడా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన నియమించడమన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. ఒకవైపు సామాజిక భేరి అనే పిచ్చి పిచ్చి యాత్రలు చేయడం వల్లే, ఈ పచ్చి నిజాలు బయటకు వచ్చాయన్నారు. నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా మన సామాజిక న్యాయం ఉన్నదని, మనం అబద్దాలు చెప్పడం వల్లే ఇతరులతో లేపి తన్నించుకున్న ట్లుగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇది మనకు అవసరమా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం సాక్షి దినపత్రిక లో పూర్తి పేజీ వ్యాపార ప్రకటన ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనకు, శ్రీ చైతన్య విద్యా సంస్థల కు ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాలేదన్నారు. మొన్న 
నారాయణ కు జరిగినట్లు తమ కూడా జరుగ వద్దని ఉద్దేశంతోనే ముందుగానే చైతన్యవంతులు అయి సాక్షి దినపత్రిక లో పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లుగా కనిపించిందని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలకు,, నగల దుకాణాల వారికి సాక్షి దినపత్రిక లో వ్యాపార ప్రకటన ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఏమినటంటూ ప్రశ్నించారు. మూడేళ్ల పరిపాలనలో ఏమి జరగలేదంటే ఈ ప్రభుత్వానికి కోపం వస్తుందన్న ఆయన, అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయని ఒక వ్యక్తి రాసిన కవితను చదివి వినిపించారు. ఇక రఘు రామ రాజు నోట జగన్ అన్న పాట అని సాక్షి దినపత్రిక లో వార్తా కథనం వేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానని అపహాస్యం చేశారు.