home page

హిమాచల్ లో ఆప్ పార్టీ కి అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

ఇప్పటికే ప్రచారంలోకి బిజెపి, కాంగ్రెస్

 | 
Jejriwal
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ జెండా ఎగురవేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇప్పుడు మళ్ళీ బిజెపి ప్రభుత్వం రావాలని కోరారు. 

కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండూ హిమాచల్ ప్రదేశ్ ప్రజలను వంచించాయని, ఆప్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆప్ నేత కేజ్రీ వాల్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిందే.