home page

ఈ పదాలు పార్లమెంటులో వాడొద్దు: నేటి నుంచి సమావేశం

విపక్షాల వాణి వినిపించేందుకు అడ్డుకట్ట 

 | 
Parliament st

ఈ పదాలు పార్లమెంటులో వాడొద్దు 

పార్లమెంట్(parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం10, గంటల నుంచి సాయంత్రం 4 గఝటల వరకూ రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు వాడకూడని కొన్ని పదాల జాబితాను(అన్ పార్లమెంటరీ వర్డ్స్) పుస్తక రూపంలో లోక్ సభ సెక్రటేరియట్(Secretariat) ఇటీవల విడుదల చేసింది.ఒక వేళ ఎవరైనా సభ్యుడు ఈ పదాలను సభలో వాడితే వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. తరువాత సభ్యుడి ఇచ్చిన వివరణ సరిగా లేకుంటే అతన్ని సభ నుంచి బయటకు పంపుతారు.

అన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితా
హిందీ పదాలు
జుమ్లా జీవి, బాల్ బుద్ధి, డ్రామా, తానాషా, తాన్ షాహి, జై చంద్, వినాష్ పురుష్, ఖలిస్థాన్, ఖూన్ సే ఖేతి, దోహ్రా చరిత్ర, నికమ్మ, నౌటంకీ, దిండోరా పీట్నా, బెహ్రీ సర్కార్, గద్దార్, గిర్ గిట్, ఘడియాలి ఆన్సూ, అప్‌మాన్, అసత్య, అహంకార, కాలా దిన్, కాల బజారి, ఖరీద్ ఫరోక్త్, దంగా, దాదాగిరి, బేచార, విశ్వాస్ ఘాత్, సంవేదన్ హీన్, పిత్తు, చంచా, చంచాగిరి వంటి పదాలను ఇకపై పార్లమెంట్‌లో వాడకుండా నిషేధించారు.
ఇంగ్లీష్ పదాలు
కోవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్, అషేమ్డ్, బిట్రేయ్డ్‌, హిపోక్రసీ, ఇన్ కంపీటెంట్, అనార్కిస్ట్, బ్లడ్ షెడ్, బ్లడీ, అబ్యూస్డ్, చీటెడ్, చైల్డిష్ నెస్, కరప్ట్, కొవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డిస్ గ్రేస్, డాంకీ, ఐవాష్, ఫడ్జ్, హూలింగనిజమ్, మిస్ లీడ్, లై, అన్ ట్రూ, లాలిపాప్, ఫూలిష్, సెక్సువల్ హరాస్‌మెంట్ వంటి పదాలను అన్ పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలో చేర్చారు.
ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?
అన్‌ పార్లమెంటరీ వర్డ్స్ వ్యక్తీకరిస్తే ఏమవుతుంది?
ఎవరైన ఓ సభ్యుడు నిషేధించిన ఈ కొత్త పదాలను సభలో ప్రయోగిస్తే.. అతనిపై చర్యలు తీసుకోవచ్చా అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2) ప్రకారం ఏ కోర్టు సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేవు. లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమావళి 380 (ఎక్స్‌పంక్షన్) ప్రకారం.. పరువుకు నష్టం కలిగించేలా లేదా అసభ్యకరమైన పదాలు లేదా అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌ను సభలో సభ్యుడు వ్యక్తీకరించడాని స్పీకర్ అభిప్రాయపడితే.. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ పదాలను సభ రికార్డ్స్ నుండి తొలగిస్తారు. ఈ పదాలను వాడిన సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్ సభ, రాజ్యసభ(Rajya Sabha) అధిపతులకు మాత్రమే ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్‌తో విపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం కేంద్రం చేస్తోందని మండిపడుతున్నాయి.
గత చరిత్ర చూస్తే.. భారత పార్లమెంట్ నియమాలు 1604 నుంచి అమల్లోకి వచ్చాయని తెలుస్తోంది. సభలు నడిచే సమయంలో సభ్యులు అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడితే వాటిని రికార్డ్స్ నుంచి తొలగించడం 16వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది.
ఇతర దేశాల్లో అన్ పార్లమెంటరీ వర్డ్స్
కేవలం బ్రిటన్ లేదా భారతదేశానికి మాత్రమే ఇది పరిమితం కాలేదు. కామన్వెల్త్ దేశాల్లోని పార్లమెంట్‌లలో కొన్ని పదాలను ఎప్పటికప్పుడు అన్‌పార్లమెంటరీగా ప్రకటిస్తున్నారు. ఆస్ట్రేలియా సెనేట్.. 1997 సెషన్‌లో, 'అబద్ధాలు', 'డంబో' పదాలను అన్‌పార్లమెంటరీగా పరిగణించాలని ఆదేశించింది. ఇక, న్యూజిలాండ్‌లో 'కామ్మో' (కమ్యూనిస్ట్‌కు యాస) అనే పదం అన్ పార్లమెంటరీగా పరిగణిస్తున్నారు. కెనడాలో ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఈవిల్ జీనియస్, కెనడియన్ ముస్సోలినీ, సిక్ అనిమల్ వంటి పదాలను అన్ పార్లమెంటరీగా పరిగణిస్తున్నారు.