home page

తీర్పుఅమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణ కేసులు:సీజెఐ

న్యాయవ్యవస్థ, కార్యనిర్వహణా వ్యవస్ధ కలిసి పనిచేయాలని హితవుపలికిన సీజెఐ రమణ

 | 
Cji ramana
దేశవ్యాప్తంగా న్యాయం చేయాలనేది కోర్టులకు తాపత్రయం ఉంటుందని, అయితే కోర్టు తీర్పులను అమలు చేయడంలో కార్యనిర్వహణా వ్యవస్ధ అలసత్వం వల్ల కోర్టు ధిక్కారణ కేసులు పెరుగుతున్నాయని సుప్రీం కోర్టు సీజేఐ రమణ చెప్పారు. శనివారంనాడు జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ రెండోరోజు సమావేశంలో జ్యుడీషియల్ అధికారులు, ముఖ్యమంత్రులతో కూడిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇటీవల కాలంలో న్యాయవ్యవస్థ పై అధికార వ్యవస్ధ దాడి చేస్తోందని అన్నారు. రెండు వ్యవస్థలూ కలిసి పనిచేస్తే వివాదాలకు తావుండదని ఆయన పేర్కొన్నారు. పలు  రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఈసమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేయనున్నారు.