home page

వారణాసిలో మసీదు వద్ద తనిఖీ

 | 
మసీదు
వారణాసి : వారణాసిలోని కాశీ విశ్వనాథ దేశవాలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపి మసీదులో కోర్టు నియమించిన అధికారులు, న్యాయవాదుల బృందం తనిఖీలు నిర్వహించింది.

గతేడాది ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్థానిక కోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. వారాణాసిలోని జ్ఞాన్వాపి మసీదు పశ్చిమ గోడ వెనుక భాగంలో ఉన్న శృంగార్‌ గౌరీ ప్రదేశానికి పరిమితులు లేకుండా సంవత్సరం పొడువునా ప్రార్థనల కోసం తెరవాలని మహిళలు పిటిషన్‌ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్థలం సంవత్సరానికొకసారి మాత్రమే ప్రార్థనల కోసం తెరవబడుతుంది. ఈ పిటిషన్‌పై స్థానిక కోర్టు...

Land bx

అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి మే 10 లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అయితే మసీదు సంరక్షణ కమిటీ న్యాయమాదులు.. మసీదు లోపల ఎలాంటి తనిఖీలు చేయకూడదని, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు..

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఓ న్యాయవాదిని కమిషనర్‌గా నియమించమని ఈ ఏడాది మార్చిలో.. మసీదు సంరక్షకుల కమిటీ స్థానిక కోర్టును అభ్యర్థించింది. స్థానిక కోర్టు అభ్యర్థనను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది.