home page

కర్నాటకలో సిఎం బొమ్మై మార్పు?

నాలుగేళ్లలో మూడోముఖ్యమంత్రి?

 | 
సీఎం బొమ్మై

యడ్యూరప్ప నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతుందా?

కర్నాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్నాటకలో పర్యటిస్తున్నారు.బిజెపి జాతీయ కార్యదర్శి బి.ఎల్.సంతోష్ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని అన్నారు. మరోవైపు ఇటీవల కాలంలో కమిషన్లు తీసుకునే ప్రభుత్వం అన్న పరచారం ఎక్కువగా జరుగుతోంది. ఒక చిన్న కాంట్రాక్టర్ నుంచి 40 శాతం కమిషన్ డిమాండ్ చేశారంటూ కేబినెట్ మంత్రి ఈశ్వరప్ప పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈశ్వరప్ప రాజీనామా చేశారు. త్వరలో మంత్రి వర్గం లో మార్పు ఉంటుందని ప,చారం జోరుగా సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి బొమ్మైను మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది.