home page

రామాలయంలో శంకుస్ధాపన కు పూజలు చేసిన సిఎం యోగి

2025 నాటికి ఆలయం నిర్మాణం పూర్తి: మిశ్రా 

 | 
Misra

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణం కొనసాగుతోంది.రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ గర్భగుడికి శంకుస్థాపన పూజ చేశారు. తొలి దశ పనుల్లో రామ మందిర నిర్మాణంలో భాగంగా ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించారు.

ఇప్పుడు రెండో దశ పనుల్లో గర్భగుడి నిర్మిస్తున్నారు. రెండవ దశ పనులను మూడు అంచెల్లో చేపట్టనున్నట్లు అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా తెలిపారు. 2023లోగా ఆలయ గర్భగృహాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇక 2024 లోపు ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని, ఆలయ నిర్మాణంలో భాగమైన కాంప్లెక్స్‌ను 2025లోగా పూర్తి చేస్తామని నిపేంద్ర మిశ్రా చెప్పారు.