home page

బుల్డోజర్ రాజకీయం

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆగిన మెగా కూల్చివేతలు

 | 
 Bulldozer

కమలదళం కొత్త ఆయుధం బుల్డోజర్!

మలదళంలో 

కొత్త ఆయుధం బుల్డోజర్!



 


ఆక్రమణల తొలగింపు పేరుతో ఢిల్లీలోని రెండు రోజుల క్రితం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న హంగీర్‌పురిలో అకస్మాత్తుగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్  ఇళ్లు, దుకాణాలను బుధవారం బుల్డోజర్లతో కూల్చివేస్తుండటం రాజకీయ దుమారం రేపింది. 

కూల్చివేతలు ఈ ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అయితే సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేతలు నిలిచిపోయాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి తమకు అందలేదన్న సాకుతో అధికారులు దాదాపు రెండు గంటల పాటు తమ పనిని కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎక్కడయితే హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో అదే ప్రాంతంలో అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేత పనులు మొదలు పెట్టారు.
భద్రతకోసం సుమారు 400 మంది పోలీసులను వెంటబెట్టుకొని తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ కట్టడాలంటూ వరసపెట్టి కూల్చివేసుకుంటూ వెళ్లారు.ఈ క్రమంలో పలు తోపుడు బండ్లు, దుకాణాల్లో భాగాలు ధ్వంసమైనాయి. ఈ క్రమంలో పిటిషనర్ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

యుపి, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపి ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిఫన్ దాఖలు చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషన్ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది.
 కానీ తమకింకా కోర్టు ఉత్తర్వులు అందలేదని చెబుతూ అధికారులు తమపని తాము చేసుకుంటూ ముందుకెళ్లారు. అలా ఓ మసీదు గోడను, గేటును కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సిపిఎం నాయకురాలు బృందాకారత్ కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బుల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓ వీడియో సైతం బయటికి వచ్చింది.

అదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేతలు ఆగలేదనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ సూచించారు. న్యాయవాది దవేనుంచి సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు తీసుకుని సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బదిని ఆదేశించారు. 
అలా దాదాపు రెండు గంటల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు జహంగీర్ పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్‌కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు గురువారం వాదనలు విననుంది.
మరోవంక, బుల్డోజర్లతో కూల్చివేస్తుండగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అడ్డుపడ్డారు. ఆమె  సుప్రీం ఆదేశాలు చూపిస్తూ బుల్డోజర్‌కుఅడ్డంగా నిలిచారు. కూల్చివేతను ఆపాలని డిమాండ్‌ చేశారు. 

కాగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న బుల్డోజర్ రాజకీయాలపై ప్రతిపక్షాల మండిపడుతున్నాయి. నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆర్‌జెడి నేత జయంతి చౌదరి విమర్శించారు. 

బిజెపి గుర్తుపై బుల్డోజర్లు నడపాలని, బిజెపి అక్రమ అధికారానికి సింబల్ బుల్డోజర్ అని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలే వాళ్ల టార్గెట్ అని, వాళ్ల హిస్టీరియాకు ఇప్పుడు హిందువులు కూడా బాధితులుగా మారారని అఖిలేష్ ధ్వజమెత్తారు.

నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా  మేయర్ కు లేఖ వ్రాయడంతో  అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌ రోజువారీ కార్యకలాపాల్లో భాగమేనని మేయర్‌ రాజా ఇక్బాల్‌ సింగ్‌ స్పష్టం చేశారు. హిందువుల  కూల్చివేసిన్నట్లు తెలి