యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
Updated: Jun 14, 2022, 22:59 IST
| తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్
గవర్నర్‌ను తప్పిస్తూ బెంగాల్ శాసనసభలో బిల్లుకు ఆమోదం
యూనివర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉండడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా ఆ అధికారాలను తప్పిస్తూ వస్తున్నాయి.
చాన్స్‌లర్ హోదా పేరుతో వర్సిటీల వ్యవహారాల్లో గవర్నర్లు అనవసర జోక్యం చేసుకుంటున్నారంటూ ఆ హోదాను రద్దు చేస్తున్నాయి. గవర్నర్ స్థానంలో వర్సిటీల చాన్స్‌లర్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించేలా అసెంబ్లీలో చట్టం చేస్తున్నాయి.
ఇప్పటికే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా, తాజాగా బెంగాల్‌లోనూ అసెంబ్లీలో సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే కేంద్ర విశ్వవిద్యాలయాలకు ప్రధానమంత్రి చాన్స్‌లర్‌గా ఉంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్సిటీలకు ముఖ్యమంత్రి చాన్స్‌లర్‌గా ఉంటే తప్పేంటని తృణమూల్ ప్రభుత్వం ప్రశ్నించింది. కాగా, తెలంగాణలోనూ గవర్నర్‌ను వర్సిటీల చాన్స్‌లర్ హోదా నుంచి తప్పించే ప్రయత్నాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది.