home page

రాంగోపాల్ వర్మ పై బాంద్రాలో కేసు

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై ట్వీట్ తో అవమానపరిచారని ఆర్జీవీ అభియోగం

 | 
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు దాఖలైంది. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై ట్వీట్లు ద్వారా మహిళను కించపరిచారని సుభాష్. రజోరా బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని పిటీషనర్ కోరారు. మహాభరతంలో  ద్రౌపది ఆమె అయినట్లయితే పాండవులు ఎవరు? కౌరవులు ఎవరని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీనిపై దుమారం చెలరేగడంతో మరుసటి రోజు తన వివరణ ఇస్తూ ద్రౌపది పాత్ర తనకు ఇష్టమైన పాత్ర అని పేర్కొన్నారు. అయినా ఇంకా వర్మ పై జనం గరం గరంగానే ఉన్నారు.‌ ఇప్పుడు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడం మరో సంచలనం కలిగించింది. పోలీసులు చుట్టూ తిరిగినా కేసు నమోదు చేలేదని, అందువల్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని రజోరా వివరణ ఇచ్చారు.