home page

నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బొణీ చేయని బిజెపి- శతృఘ్న సిన్హా విజయం

టిఎంసి తరఫున బాబూలాల్ సుప్రియో ఘన విజయం 

 | 
Babulal supriyo

ఉప ఎన్నికల్లో వికసించని కమలం!

న్యూఢిల్లీ  : 
నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. 
ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. బీహార్‌లో అధికార ఎన్‌డిఎకు ఎదురుదెబ్బ తగిలింది. బోచహాన్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రతిపక్ష ఆర్‌జెడి అభ్యర్థి అమర్‌ కుమార్‌ పాశ్వాన్‌ బిజెపి అభ్యర్థి బేబీ కుమారిపై 36,653 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి యశోదానీలాంబర్‌ వర్మ బిజెపి అభ్యర్థి కోమల్‌ జంఘెల్‌పై 20,176 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జాదవ్‌ జయశ్రీ చంద్రకాంత్‌ 54.34 ఓట్ల శాతం ఓట్లు సాధించి, బిజెపి అభ్యర్థి సత్యజీత్‌ కడమ్‌పై 19,307 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని 

♦️బాలిఘంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి నుంచి టిఎంసిలో చేరిన సింగర్‌ బాబుల్‌ సుప్రియో విజయం సాధించారు. 

 టిఎంసి 49.69 శాతం, సిపిఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌ 30.06 శాతం (30,971) ఓట్లు వచ్చాయి. బిజెపి 12.31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 

అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టిఎంసి అభ్యర్థి శత్రుఘు సిన్హా సుమారు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థిపై విజయం సాధించారు. 
సిపిఎం అభ్యర్థి పార్థ ముఖర్జీకి 90,412 ఓట్లు వచ్చాయి. బిజెపి మాజీ నేత శత్రుఘు సిన్హా టిఎంసిలో కొద్దిరోజుల క్రితం చేరిన సంగతి తెలిసిందే.