home page

బిజెపి గుజరాత్ టార్గెట్ 150 సీట్లు

పాటిదారుల ప్రపకం కోసం పాట్లు 

 | 
Bjp

హార్దిక పటేల్ దర్శకత్వంలో ప్రచారం 

గుజరాత్‌పై బహుముఖ వ్యూహం
పాటిదార్లు, గిరిజనులు, ఆదివాసీలపై దృష్టి
 ఎన్నికల్లో గుజరాత్‌లో మరోసారి సత్తా చాటడానికి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బహుముఖ వ్యూహాలను రచిస్తోంది.డిసెంబరులో జరగనున్న ఎన్నికల్లో 150 స్థానాల్లో సాఽధించాలన్న లక్ష్యం పెట్టుకుంది. పన్నా సమితులు, శక్తి కేంద్రాలను ఇప్పటికే క్రియాశీలకం చేసింది. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజావ్యతిరేకత ఒక సవాలు అని రాజకీయ వర్గాలు భావిస్తుండడంతో.. నష్టనివారణలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇప్పటికే అనేక సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ముఖ్యంగా కొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే విధానాన్ని ఈసారి కూడా అమలు చేయనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 60 నుంచి 70ు స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో పటేల్‌, పాటిదార్లు రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి, హార్దిక్‌ పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమం బీజేపీకి ప్రతికూలంగా మారింది. దాంతో పటేల్‌ వర్గంలో బలమైన నాయకుడిగా ముద్రపడిన హార్దిక్‌ పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకుంది. విజయ్‌ రూపానీని ముఖ్యమంత్రిగా తప్పించి భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది.
ఆదివాసీ, గిరిజనులపై నజర్‌
గుజరాత్‌లో గిరిజన, ఆదివాసీ ఓట్లు కీలకం. చోటా ఉదయ్‌పూర్‌, పంచ్‌మహల్‌, గోద్రా ప్రాంతాల్లో ఆదివాసీల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నాయి. దీంతో.. ఆదివాసీ ఓట్లను తమ వైపు తిప్పుకోడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 15ుపైగా గిరిజన జనాభా ఉండగా.. 27 ఎస్టీ రిజర్వు స్థానాలున్నాయి. పార్టీలకతీతంగా గిరిజన ప్రజాప్రతినిధులు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చి.. గుజరాత్‌లోని కాంగ్రెస్‌ గిరిజన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఓటర్ల నాడిని పట్టే యాప్‌?
ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, ఎన్నికల ఫలితాల కచ్చితత్వం తెలుసుకోవడానికి బీజేపీ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. 'ప్రెసిడెంట్‌ డ్యాష్‌బోర్డు' పేరిట తయారు చేసిన యాప్‌ను ఇటీవల గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి వారి సమాచారాన్ని సేకరించి ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పోలింగ్‌ జరిగే నాడు బూత్‌ ఇన్‌చార్జి బూత్‌ బయట కూర్చోని ఎవరెవరు ఓటు వేశారు అన్నది ఇదే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో టిక్‌ చేస్తారని, అప్పటికే ఓటరు వివరాలున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది వెంటనే అంచనా వేయవచ్చునని గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ యగ్నేష్‌ దవే చెప్పారు.
ముస్లింల ప్రభావం ఎంత?
గుజరాత్‌లో ముస్లింల జనాభా 10 శాతం ఉంటుంది. అహ్మదాబాద్‌, మాండ్వీ నియోజకర్గాలలో మినహా ఎక్కడా ముస్లిం ఓటర్లు పెద్దగా లేరు. మాండ్విలో ముస్లింల ప్రభావం ఎక్కువే అయినా.. అక్కడ బీజేపీదే పైచేయి. ఈ నియోజకవర్గం చరిత్రను పరిశీలిస్తే.. 7 సార్లు బీజేపీ, 4 సార్లు కాంగ్రెస్‌ తమ సత్తా చాటుకున్నాయి. ప్రస్తుతం కమలం నేతే అక్కడ ఎమ్యెల్యేగా ఉన్నారు. ముస్లింల ఓట్లను ఒడిసిపట్టుకునేందుకు మజ్లిస్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మరోవైపు, తమ కంచుకోటగా ఉన్న మాండ్వీలో మళ్లీ విజయం తమదేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. గుజరాత్‌లో ఓబీసీల పాత్ర అత్యంత కీలకం. సబర్‌కాంట, బనా్‌సకాంట, పాట్నా, మెహసానా వంటి ప్రాంతాల్లో ఓబీసీలు గెలుపోటములను శాసించేంత ప్రాబల్యం ఉంది. ఓబీసీల ఓట్లలో కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి 60ు, కాంగ్రె్‌సకు 40% వస్తున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.