home page

బిజెపి అనేది ఇద్దరు- గుజరాతీయుల పార్టీ!

మిగతా పార్టీలన్నీ భిన్నత్వంలో ఏకత్వం!

 | 
Bjp flag

బిజెపి  ఏకత్వం లో భిన్నత్వ పార్టీ!

Bjpబిజెపి ఒక గుజరాతీ పార్టీ !

"దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు 'కుటుంబం పార్టీలు' అని విమర్శలు చేస్తుంటే బిజెపి 'ఒక వ్యక్తి పార్టీ' లేదా 'ఇద్దరు గుజరాతీయులు నడిపే' పార్టీగా ప్రసిద్ధి పొందుతున్నది. InBjp

ఆ పార్టీలో నిర్ణయాలు తీసుకో గలిగింది ఒకే ఒక వ్యక్తి. ఆయన చెప్పిందే పార్టీ విధానం. ఎటువంటి చర్చలకు అవకాశం లేదు. అయితే తొలిసారిగా ఆ నేత నిర్ణయాలను ఎదురుపడి ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్రంలోని అధికార పార్టీలో లుకలుకలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. గత నెల రోజులుగా ఓ సీనియర్ కేంద్ర మంత్రి నేరుగా ప్రధాన మంత్రి నిర్ణయాలనే సవాల్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇవే నిజమయితే అత్యున్నత స్థాయిలో 'తిరుగుబాటు' ప్రారంభమైనట్లు భావించవలసి వస్తుంది. మహారాష్ట్రలో లోకమాత్ పత్రికలు ప్రచురించిన కథనం ప్రకారం ఓ సీనియర్ కేంద్ర మంత్రి ప్రధానికి వ్యతిరేకంగా 252 మంది పార్టీ ఎంపిలను తాను సమీకరింపగలనని సవాల్ చేశారు. ఆ మంత్రి పేరు రాయక పోయినప్పటికీ ఊహించడం కష్టం కాబోదు.

దేశంలో తిరుగులేని నాయకురాలిగా వెలుగొందుతున్న సమయంలో అలహాబాద్ హైకోర్టు తన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడంతో, కేవలం తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాల ఆందోళనలను ఆసరాగా చేసుకొని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలు జైళ్లలో ఉండడమో, మౌనంగా ఉండడమో చేశారు. జార్జ్ ఫెర్నాండెస్ వంటి కొద్ది మంది నేతలు మినహా మరెవ్వరూ ఆమెను సవాల్ చేసే ప్రయత్నం చేయలేదు. పత్రికలపై సెన్సార్షిప్ అమలులో ఉండడంతో దేశంలో అంతా సవ్యంగానే ఉన్నదనుకొని, ఎన్నికలు జరిగితే గెలుపు తధ్యం అని నిఘా సంస్థల నివేదికలను విశ్వసించి, ఆమె ఎన్నికలకు వెళ్లి, ఘోర పరాజయం పొందడం చూసాము. వాస్తవానికి అప్పటికే పార్లమెంట్ గడుపు ఓ ఏడాది పాటు పొడిగించారు. ఆమెకు వెంటనే ఎన్నికలు జరపవలసిన అవసరం లేదు. ఓటమి అనంతరం తమ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన బ్లీడ్జ్ సంపాదకుడు కరాంజీయా పరామర్శకు వస్తే 'అంకుల్ ఈ విధంగా ఎందుకు జరిగింది?' అంటూ ఇందిరా గాంధీ ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆమెకు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన ఆయన అందుకు ఒకే సమాధానం చెప్పారు.

'అమ్మ నీవు ప్రెస్ సెన్సార్షిప్ విధించడంతో దేశంలో ఎక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియకుండా పోయింది. కనీసం నీ వద్దకు వచ్చి నీకు నచ్చని వాస్తవాలు చెప్పే సాహసం కూడా నీ మద్దతుదారులు ఎవ్వరూ చేయలేదు. అదే పెద్ద పొరపాటు. నీవు మీడియాను స్వేచ్ఛగా వదిలివేసి ఉంటే, వాస్తవాలు తెలిసి సరిదిద్దుకొనే అవకాశం నీకు కలిగి ఉండెడిది' అని చెప్పారు. సరిగా 42 ఏళ్ళ అనంతరం ఇప్పుడు తిరిగి అటువంటి పరిస్థితి నెలకొందా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాగ్రత్త పడని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వారికి ఇటువంటి అనుమానాలు కలగక మానవు. ఎందుకంటె, సున్నితంగా విమర్శిస్తూ ట్వీట్‌లు ఇచ్చినా అరెస్ట్ చేస్తున్నారు. దానితో ప్రధాన మీడియా వాస్తవాలు తెలపడానికి వెనుకంజ వేస్తున్నది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు గురించి నిత్యం మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుంటాయి. అటువంటి వార్తలను ఎవ్వరు తీవ్రంగా పరిగణించడం లేదు కూడా. ఆ పార్టీ నైజమే.. ఒక విధంగా బలం కూడా అవే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బిజెపిలో మాత్రం కుమ్ములాటలు గురించి మీడియాలో పెద్దగా వార్తలు రావు. ఇటువంటి పరిస్థితి ఆ పార్టీకి సంకటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు 'కుటుంబం పార్టీలు' అని విమర్శలు చేస్తుంటే బిజెపి 'ఒక వ్యక్తి పార్టీ' లేదా 'ఇద్దరు గుజరాతీయులు నడిపే' పార్టీగా ప్రసిద్ధి పొందుతున్నది. ఆ పార్టీలో నిర్ణయాలు తీసుకో గలిగింది ఒకే ఒక వ్యక్తి. ఆయన చెప్పిందే పార్టీ విధానం. ఎటువంటి చర్చలకు అవకాశం లేదు. అయితే తొలిసారిగా ఆ నేత నిర్ణయాలను ఎదురుపడి ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్రంలోని అధికార పార్టీలో లుకలుకలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. గత నెల రోజులుగా ఓ సీనియర్ కేంద్ర మంత్రి నేరుగా ప్రధాన మంత్రి నిర్ణయాలనే సవాల్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇవే నిజమయితే అత్యున్నత స్థాయిలో 'తిరుగుబాటు' ప్రారంభమైనట్లు భావించవలసి వస్తుంది. మహారాష్ట్రలో లోకమాత్ పత్రికలు ప్రచురించిన కథనం ప్రకారం ఓ సీనియర్ కేంద్ర మంత్రి ప్రధానికి వ్యతిరేకంగా 252 మంది పార్టీ ఎంపిలను తాను సమీకరింపగలనని సవాల్ చేశారు. ఆ మంత్రి పేరు రాయకపోయినప్పటికీ ఊహించడం కష్టం కాబోదు. ఈ 'తిరుగుబాటు'కు మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలే కేంద్రం కావడం గమనార్హం. ముఖ్యంగా శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని బిజెపిలోని ఓ బలమైన వర్గం వ్యతిరేకిస్తున్నది.

ఆ పార్టీ సుదీర్ఘ కాలం బిజెపి మిత్రపక్షమే కాకుండా, సైద్ధాంతికంగా కూడా సన్నిహితమైనది కావడమే అందుకు కారణం. ఎప్పటివో పాత కేసులు తీసుకొచ్చి దాడులు జరపడం, ఆస్తులు సీజ్ చేయడం ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు. ఆ విధంగానే రాజకీయ ప్రత్యర్థులను అణగద్రొక్కి తాను ముఖ్యమంత్రి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్నానని ప్రధాని చెప్పారని, అందుకు ప్రతిస్పందనగా ఇప్పుడు తలచు కొంటే తాను 252 మంది పార్టీ ఎంపిలతో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టగలనని ఆ సీనియర్ మంత్రి స్పష్టం చేశారని ఈ కథనం వెల్లడించింది. అయితే పార్టీకి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తానా విధంగా చేయడం లేదని చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ కథనం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా ఖండించే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. పైగా ఒక గంటకు పైగా ఆ కేంద్ర మంత్రితో మాట్లాడినప్పుడు పార్టీలో నెలకొన్న అసంతృప్తి గురించి ఆ కేంద్ర మంత్రి అనేక విషయాలు చెప్పిన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. ఈ కథనాన్ని ఆధారం చేసుకొని కొన్ని యూ ట్యూబ్ చాన్నాళ్లు కథనాలు ప్రసారం చేశాయి కూడా. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో గట్టెక్కినా రాష్ట్రపతి ఎన్నికలకు అవసరమైన పూర్తి మెజారిటీ లేదని, శివసేన వంటి పార్టీల మద్దతు కూడదీసుకోవడమో లేదా కనీసం తటస్థంగా ఉండేటట్లు చేయడమో చేయాలని ఆ కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలుస్తున్నది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ దిగిపోవాలని దేశం మొత్తం ఆందోళన చేస్తున్న సమయంలో మద్దతుగా నిలచింది శివసేన ఒక్కటే అనే విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

గత ఎనిమిదేళ్లుగా దేశంలో తిరుగులేని నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎదిగినా, రాజకీయ ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తున్నా సొంత పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తిని విస్మరింపలేని పరిస్థితులు నెలకొన్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వయస్సు పేరుతోనో, మరో పేరుతోనో సీనియర్ లందరినీ క్రియాశీల రాజకీయాల నుండి తప్పించి, 'కీలుబొమ్మలు'గా వ్యవహరించే, ప్రజలను ప్రభావితం చేయలేని వారికి కీలక పదవులు కట్టబెడుతూ పార్టీలో భిన్నస్వరాలకు ఆస్కారం లేకుండా చేస్తూ వచ్చారు.అయితే భావోద్వేగ అంశాలతో కాలం గడుపుతూ, పరిపాలనను గాలికి వదిలివేయడం, ధరలు, ఉద్యోగ అవకాశాలు, ఇతర కీలక అంశాలను పట్టించుకోక పోవడంతో ప్రజలలో అసంతృప్తి పెరుగుతూ వస్తున్నదని పార్టీ నేతలు వివిధ స్థాయిలలో ఆందోళన చెందుతున్నారు. విదేశాంగ, ఆర్ధిక విధానాల విషయం లో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం నాయకత్వానికి అనుకువుగా ఉంటే చాలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా రక్షణ కవచంగా ఉంటారని, ఏమాత్రం ధిక్కరించినా పసలేని కేసులను తెరపైకి తీసుకొచ్చి వేధిస్తారని బహిరంగంగానే వ్యాఖ్యలు వస్తున్నాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు గల కొందరు బిజెపియేతర నేతలకు సహితం కేంద్రం 'రక్షణ కవచం'గా వ్యవహరిస్తున్నట్లు సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.

కనీసం ముఖ్యమంత్రుల ఎంపికలో ఆయా రాష్ట్రాలలోని సీనియర్ పార్టీ నేతలను సంప్రదించకపోవడం ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవ్వరో నిర్ణయించే ముందు అక్కడ మాజీ ముఖ్యమంత్రి రాజనాథ్ సింగ్ ను కనీసం సంప్రదించలేదు.అదే విధంగా మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ ప్రమేయం లేకుండానే గతంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి - శివసేన మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పార్టీ ఆదేశిస్తే తాను శివసేనతో సంప్రదింపులు జరిపి, పరిష్కరిస్తానని గడ్కరీ బహిరంగంగా చెప్పినా ఆయనకు పార్టీ ఆ బాధ్యత అప్పచెప్పలేదు. క్రియాశీల రాజకీయాల నుండి వైదొలగడం ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి చేశారు. దేశం మొత్తం మీద సొంతంగా ప్రజాభిమానం గల అతికొద్ది మంది బిజెపి నేతలలో ఒకరైన బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాజ్యసభ, ఎమ్యెల్సీ అభ్యర్థుల ఎంపికలో, కనీసం పార్టీ కార్యవర్గ సభ్యుల ఎంపికలో సహితం ఆయన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు పార్టీలో బలమైన నాయకులు ఎవ్వరూ ఉండరాదని, కేవలం ప్రధాని ఇమేజ్ ఆధారంగా ఓట్లు పొందాలనే విధానం కొనసాగుతూ వస్తున్నది. ఇటువంటి అవమానాలకు పలువురు సీనియర్ నేతలు తలవంచుతున్నా, మౌనంగా ఉన్నా పలువురు ఇప్పటికైనా ప్రశ్నించడం చేయకపోతే మొత్తం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాగలదని ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.