home page

ఏపిలో ఎన్నికల పొత్తులపై పవన్ స్పష్టత ఇచ్చినట్లే!

టిడిపి-జనసేన మధ్యలో కమలం!

 | 

ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపి కి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఒకే తాటిమీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని, పొత్తులపై చర్చలు అవసరమని జనసేన అధినేత పవ న్అభిప్రాయపడ్డారు. ఏపీ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని సూచించారు. ఇదే బాణీలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న సంకేేేేతాలు ఇచ్చారు. ఇవాళ  జనసేన అధినేత పవన్ మరో సారి ఇదేేవిషయం ప్రస్తావించడం పొత్తులపై స్పష్టత ఇచ్చినట్లే.

బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. మోదీ, అమిత్ షా అంటే తనకు గౌరవం ఉందన్నారు. రోడ్ మ్యాప్ పై సరైన సమయంలో స్పందిస్తామని, పొత్తు ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలని జనసేనాని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుందని, ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ చెప్పారు. ఇటీవల జిల్లాల పర్యటనలో వైసీపీని ఎదుర్కొనేందుకు అందరూ కలిసి రావాల్సిన అవసరముందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ నోట వెంట కూడా అలాంటి మాటలే వినిపించడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని, మళ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీలో కలకలం రేగుతోంది. ఆ మూడు పార్టీకి కలిస్తే మళ్లీ 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే ఆందోళన అధికార పార్టీలో కనిపిస్తోంది.