home page

ఇక్కడ అరాచకం పెరుగుతోంది: ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపణ

జమ్మూ కాశ్మీర్ లో ఆగని ఆగడాలు

కాశ్మీరీ పండిట్ లే లక్ష్యం 

 | 
Farooq

 జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దూల్లా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక హిందూ మహిళా టీచర్ ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, ఫరూక్ అబ్దూల్లాను కొందరు విలేకరులు లేడీ టీచర్ ఘటనపై ఆయనను ప్రశ్నించారు.. దీనిపై ఫరూక్ అబ్దుల్లా ఉగ్రవాదులు అందరిని చంపేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపాయి.

అదే విధంగా, జమ్ములో ప్రస్తుతం అనేక మంది పోలీసులు, కశ్మీరీ పండిట్ లు, అమాయక ప్రజలు హత్యలకు గురౌతున్నారు. అక్కడ అరాచక శక్తులు ఆగాడాలు చేస్తున్నాయి. అయినప్పటికి జమ్ము లో శాంతి ఉందని.. అక్కడి ప్రభుత్వం చెప్పడం హస్యాస్పదంగా ఉందని ఫరూక్ అన్నారు. ప్రజలలో ధైర్యం నింపేలా, భరోసా కల్గేలా చర్యలు తీసుకొవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొన్ని రోజులుగా జమ్ములో మరోసారి ఉగ్రవాదులు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. కాగా, దేశంలో ఏదైన అనుకోని ఘటన జరిగితే రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ధైర్యం, భరోసాను కల్పించాలి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లా చేసిన కామెంట్స్ పుండు మీద కారం చల్లినవిధంగా ఉన్నాయని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా జమ్ములో లేడీ టీచర్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాంలోని గోపాల్​పురలో ఓ కశ్మీరీ పండిట్ టీచర్​పై ముష్కరులు కాల్పులుకు తెగబెడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
మృతురాలిని రజనీ భల్లాగా గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లా నివాసి. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి,మట్టుబెడుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. గత వారం టీవీ నటిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారు.