nani,vishwaksen,HIT movie

విష్వక్సేన్ హీరోగా ‘హిట్’ .. ప్రోమో రిలీజ్

నాని నిర్మాతగా ‘హిట్’ మూవీ
మిస్సింగ్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
ఈ నెల 28వ తేదీన విడుదల
నాని కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను వరుస సినిమాలను నిర్మిస్తున్నాడు. తన ‘వాల్ పోస్టర్’ బ్యానర్ పై ఆయన మరో సినిమాను నిర్మించాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్వక్సేన్ హీరోగా నటించాడు. ఈ సినిమాకి ‘హిట్’ (హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) అనే టైటిల్ ను ఖరారు చేశారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీమ్ గా ‘హిట్’ ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ‘హిట్’ టీమ్ కి సంబంధించిన ఆఫీసర్ గా విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ప్రీతీ అనే ఒక అమ్మాయి మిస్సింగ్ మిస్టరీ చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు.
Tags: nani,vishwaksen,HIT movie