మరో మూడు కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం

మాదిగ, మాల, రెల్లి కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు
ఆర్థికంగా ఆదుకునేందుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మాదిగలకు గతంలోనే హామీ ఇచ్చిన జగన్
ఏపీలో మరో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కులాలకు కార్పొరేషన్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మాల వెల్ఫేర్ కార్పొరేషన్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్, రెల్లి వెల్ఫేర్ కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మూడు కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags: Madiga, Mala, Relli Corporations, Andhra Pradesh, Jagan govt