LV Subrahmanyam, Pravin Prakash, Andhra Pradesh, Jagan govt

ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన ప్రవీణ్ ప్రకాశ్

  • ఇటీవలే షోకాజ్ నోటీసు అందుకున్న ప్రవీణ్ ప్రకాశ్
  • వివరణ ఇస్తూ ఇన్ చార్జి సీఎస్ కు లేఖ
  • నిబంధనల ప్రకారమే చేశానని వెల్లడి

ఇటీవలే సీఎస్ హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్ చార్జి సీఎస్ నీరబ్ కుమార్ కు లేఖ రాశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల అంశం మంత్రివర్గ భేటీ అజెండాలో పెట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా, గ్రామ న్యాయాలయాల విషయం కూడా మంత్రివర్గ భేటీ అజెండాలో పొందుపరిచినట్టు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను వ్యవహరించానని లేఖలో వివరించారు. అప్పటి సీఎస్ నిర్ణయాల మేరకే వ్యవహరించానని ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు.

గ్రామ న్యాయాలయాల అంశాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావాల్సిన అంశాన్ని కూడా వివరించినా, తన వివరణ పట్టించుకోకుండా షోకాజ్ నోటీసు పంపారని ఎల్వీపై ఆరోపణ చేశారు. ప్రజలకు సత్వర న్యాయం, లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం ఏపీ క్యాడర్ కు ఉన్న ప్రత్యేకత అని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్సార్ శంకరన్, ఏవీఎస్ రెడ్డి, యుగంధర్ తదితరుల స్ఫూర్తితో ఏపీ క్యాడర్ పనిచేస్తోందని తెలిపారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా తాజా ఎపిసోడ్ తెరపైకి రావడం బాధించిందని ప్రవీణ్ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: LV Subrahmanyam, Pravin Prakash, Andhra Pradesh, Jagan govt

Leave a Reply