KCR,Telangana,Sagar

సాగర్ వద్ద కూడా కేసీఆర్ చిత్రం తొలగింపు

భద్రాద్రి ఆలయంలోని స్తంభాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను చెక్కడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విపక్షాలు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో, స్తంభాలపై కేసీఆర్, కారు గుర్తులను తొలగించారు.

మరోవైపు, తాజాగా సాగర్ బుద్ధవనం వద్ద ఉన్న కేసీఆర్ చిత్రాన్ని కూడా తొలగించారు. బుద్ధుడికి కేసీఆర్ పుష్పాంజలి ఘటిస్తున్నట్టు ఈ చిత్రాన్ని చెక్కారు. తాజా వివాదం నేపథ్యంలో ఈ బొమ్మను కూడా తొలగించారు.
Tags: KCR,Telangana,Sagar