janasena on three capital in ap

రాజధానుల రగడపై విస్తృత చర్చ

అమరావతి రాజధాని మార్పుకు సంబంధించిన రగడ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజాసంఘాలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. అమరావతి రాజధానిని మార్చేందుకు వీలు లేదని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని వివరాలను తెలిపే సమాచారం ఉన్న పుస్తకాన్ని విడుదలచేసిన పవన్ వాటిని  సభ్యులకు అందచేశారు.ఈ భేటీలో మూడు రాజధానుల అంశం, రైతుల సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.  వీటితో పాటుగా జనసేన కమిటీ సభ్యులు అమరావతిలో పర్యటించి ఓ నివేదికను తయారు చేశారు.

ఆ నివేదికపై కూడా చర్చ జరుగుతోంది. రాజధాని అంశంపై పార్టీకి చెందిన నేతల అభిప్రాయాలను పవన్ తెలుసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మూడు రాజధానుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.విశాఖ, కర్నూలును కాదంటే జనసేన కార్యకర్తలను నొప్పించినట్టు అవుతుందని పవన్ భావిస్తున్నారు. ఇవాళ్టి సమావేశంలో రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించి ఆందోళన చేస్తున్న రాజధాని రైతులతో మాట్లాడతానని పవన్ చెప్పారు. జగన్ నిర్ణయం జనసేనకు సంకటంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.