home page

చైనా దెబ్బకు లావోస్ విలవిల

ఆర్ధిక సంక్షోభంలో మరో దేశం

 | 
Lavos
చైనా రుణాలతో ఆర్థిక సంక్షోభ ఊబిలో కూరుకుపోతున్న దేశాల జాబితాలో మరో దేశం లావోస్ చేరనున్నది. శ్రీలంక, పాకిస్థాన్‌ తరువాత మరో దక్షిణాసియా దేశం లావోస్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.

దారుణమైన పాలన, చైనా అప్పులు ఆ దేశాన్ని నిండా ముంచుతున్నాయి. రాకెట్లా దుసుకుపోతున్న ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరుగుతున్న ధరలు లావోస్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పడిపోతున్న విదేశీ మారక నిధులు అప్పులు చెల్లించలేక లావోస్ చేతులెత్తేస్తోంది.

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు చమురు కొరత పెట్రోలు బంకుల వద్ద వేలాది మంది క్యూలు నిత్యం ప్రజల నిరసనలు విదేశీ నిధుల కొరత ఇవన్నీ చూస్తుంటే మనకు టక్కున శ్రీలంక గుర్తొస్తుంది కదా అయితే ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీలంకలోని పరిస్థితులు కాదు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తూర్పు దక్షిణాసియా దేశం లావోస్ చైనా, మియన్మార్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, కాంబోడియా దేశాలు సరిహద్దులో ఉన్న చిన్న దేశం. ఈ దేశ జనాభా 75 లక్షలు. ఈ దేశం కరెన్సీని కిప్‌ అని పిలుస్తారు. చాలా మందికి ఈ దేశం పేరు కూడా తెలియదు. కానీ చైనా అప్పులతో నిండా మునిగిన దేశంగా ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది. డాలరుతో పోలిస్తే కిప్‌ విలువ 36 శాతానికి పడిపోయింది. దీంతో ద్రవోల్బణం పరుగులు పెడుతోంది. గత నెలలో ఏకంగా 13 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. 2004 తరువాత రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి. శ్రీలంక, పాకిస్థాన్ తరువాత అత్యంత దారుణ పరిస్థితులను లావోస్‌ ఎదుర్కొంటోంది.

లావోస్‌ వార్షిక ఆదాయం 130 కోట్ల డాలర్లు. అయితే ఏటా అప్పుల చెల్లింపునకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. విదేశీ రుణాలనే లావోస్‌ ఏటా 130 కోట్ల డాలర్లను చెల్లిస్తోంది. అంటే ఆ దేశ ఆదాయం, అప్పులు సమానంగా ఉన్నాయి. దీంతో వద్ద విదేశీ నిధులు లేవన్న మాట. దాదాపు లావోస్‌ దివాలా అంచున నడుస్తోంది. లావోస్‌ క్రెడిట్‌ రేట్‌ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఈ దేశానికి సీఏఏ3గా రేటింగ్స్‌ను ఇస్తున్నారు. అంటే దాదాపు ఈ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అర్థం. దారుణమైన పాలన, తీవ్ర అప్పులు, విదేశీ మారక నిధుల కొరతతోనే లావోస్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్టు క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు వివరిస్తున్నాయి. లావోస్‌ చెల్లించాల్సిన మొత్తం విదేశీ బకాయిలు 14వందల 50 కోట్ల డాలర్లు. ఇది ఆ దేశ తలసరి ఆదాయంలో 88 శాతం. ఇందులో 700 కోట్ల డాలర్ల అప్పులు చైనావే కావడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా చైనా నుంచి లావోస్‌ భారీగా అప్పులు తీసుకుంది. లావోస్‌లోని హైడ్రో పవర్, రైల్వే లైన్ల ప్రాజెక్టులకు చైనా పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది. కేవలం చైనా-లావోస్‌ రైల్వే లైన్‌కే 600 కోట్ల డాలర్లను వెచ్చించింది. ఇదే లావోస్‌ కొంప ముంచింది. దివాళా అంచున కూరుకుపోయిన లావోస్‌కు ఊరట లభించలాంటే.. చైనా బకాయిల చెల్లింపుల నిబంధనలను సడలించాల్సిందే. అయితే అందుకు డ్రాగన్‌ కంట్రీ ససేమిరా అంటోంది. అప్పులు చెల్లించాల్సిందేనని శ్రీలంకను పట్టుబట్టినట్టే లావోస్‌ను కూడా డిమాండ్‌ చేస్తోంది. అయితే అప్పుల చెల్లింపు విషయంలో మొదట్లో చైనా ఊరటనిస్తుందని కానీ భవిష్యత్తులో మాత్రం బకాయిలను ముక్కు పిండి వసూలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పూర్తిగా ఆర్థిక, ఆహార, చమురు సంక్షోభం నెలకొన్నది. అలాంటి దేశాల జాబితాలో ఇప్పుడు లావోస్ కూడా చేరింది.

ప్రపంచంలోని 165 దేశాలకు చైనా మొత్తం 38వేల 500 కోట్ల డాలర్ల రుణాలను ఇచ్చింది. ఈ 165 దేశాల్లో తక్కువ ఆదాయం కలిగిన దేశాలు 42 ఉన్నాయి. ఈ దేశాల జాబితాలో ఆయా దేశాలైనా శ్రీలంక, మాల్దీవ్స్‌, పాకిస్థాన్‌, మయన్మార్‌, టుర్క్మేనిస్థాన్‌, కజకిస్థాన్‌ దేశాలు ఉన్నాయి. ఈ 42 దేశాలు తమ తలసరి ఆదాయం కంటే అదనంగా 10 శాతం చైనాకు చెల్లిచాల్సి ఉంది. ఆయా దేశాలన్నీ చైనా అప్పుల్లో కూరుకుపోయాయి. చైనా రుణ పాలసీ దారుణంగా ఉంటుంది. పాకిస్థాన్‌ అప్పులనే తీసుకుంటే చైనా 4 శాతం వడ్డీ రేటుకు రుణాలను ఇచ్చింది. అవే అప్పులకు పశ్చిమ దేశాలు వసూలు చేసే వడ్డీ రేటు కేవలం 1.1 శాతమే. ఈ రకంగా పోల్చుకుంటే చైనా అధిక వడ్డీలకు అప్పులను ఇస్తోంది. అంతేకాదు చైనా అప్పులు నిబంధనలు దాచిపెడుతుంది. చైనా ఆర్థిక విధానం పారదర్శకంగా ఉండదు. ఈ విషయమై అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించడం లేదు.

అధిక వడ్డీలపై విమర్శలు వస్తుండడంతో చైనా చాలా సింపుల్‌గా తప్పించుకుంటుంది. ఆ అప్పులను చైనా ప్రభుత్వం నేరుగా ఇవ్వదు. ప్రత్యేక కంపెనీల ఆధ్వర్యంలో అప్పులను ఇస్తుంది. అంతర్జాతీయ విమర్శలకు చెక్‌ పెడుతోంది. ఆయా దేశాలు అప్పులను చెల్లించపోతే అక్కడి పోర్టులను, ఎయిర్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటుంది. శ్రీలంక తరువాత, లావోస్‌, భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది.