Modi-hugged-Trump

శంఖాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు… అబ్బరపడిన ట్రంప్!

ఇండియాలో కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అద్భుత రీతిలో స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో ఎయిర్ ఫోర్స్ విమానం దిగిన ట్రంప్ నకు, తొలుత స్వాగతం పలికి నరేంద్ర మోదీ, కరచాలనం, కౌగిలింతతో ఆహ్వానం పలుకగా, ఆపై, భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బర పరిచింది. శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశర్చపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన పయనం అయ్యారు.

Tags: Donald Trump, Welcome India, Narendra Modi