దేవులపల్లి అమర్ ప్రమాణస్వీకారం

జాతీయ , అంతర్రాష్ట్రీయ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ మంగళ వారం బాధ్యతలు సవీకరించారు. అంతకు ముందు అమర్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి గూడెం లో ఆయన నివాసం లో కలిశారు . బాధ్యతలు సవీకరించిన అనంతరం అమర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు ఈ అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం గా ఉందని , , అప్పగించిన బాధ్యత గురుతరమైనది, సులభమైనది కాదు అని అమర్ అన్నారు . ఇరవైనాలుగు గంటలూ మీడియా వ్యవహారాలకు అందుబాటులో ఉంటానాని అమర్ తెలిపారు.వ్యక్తిగతంగా అందరు మీడియా మిత్రులను కలుస్తాను… ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేస్తానాని అమర్ తెలిపారు.మీడియాలో కావలసిన అన్ని మార్పులు వచ్చేలాప్రయత్నిస్తూ, జర్నలిస్టుల సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని అన్నారు .రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ …దేవులపల్లి అమర్ కు సముచితమైన స్ధానం దక్కింది,జాతీయ మీడియాలో రాష్ట్ర మీడియాకు ప్రాధాన్యత తీసుకువస్తారని ఆశిస్తున్నాం…అమర్ ఈరోజు బాధ్యతలు చేపడుతున్నారు అని అన్నారు.రాష్ట్ర మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ..అమర్ చాలా సీనియర్ పాత్రికేయుడు,అందరికి సుపరిచితుడు అన్నారు. జర్నలిస్టు సమస్యలపై ముందుండి నడిపించిన అమర్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారని, ప్రభుత్వాన్ని జాతీయ స్ధాయిలో రిప్రెజెంట్ చేయగలిగిన, పరిపక్వత కలిగిన వ్యక్తిగా గుర్తించి అమర్ ను సిఎం జగన్ ఎంపిక చేశారాణి అన్నారు .ఉన్నది వక్రీకరించకుండా చూడగలగడమే ప్రచారం, అటువంటి విషయంలో అమర్ సిద్ధహస్తుడుమీడియాకు దగ్గర కావడంలోమరియు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించే కార్యల్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళడంలో అమర్ ముందుంటాదాని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు కె రామ చంద్ర మూర్తి , ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టుల సంఘం నాయకులు , ప్రతినిధులు పాల్గొన్నారు. కోటప్పకొండ ప్రధాన అర్చకులు అమర్ ను ఈ సందర్బంగా ఆశీర్వదించారు.