home page

రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరిట టోకరా: 20 లక్షలు.వసూలు

గాజువాక నివాసిని అరెస్టు చేసిన పోలీసులు

 | 

విశాఖపట్నంజిల్లా....
రాజస్థాన్ ఎమ్మెల్యేల నుంచి వసూళ్లు :                    విశాఖ లోప్రియురాలికి రూ.80లక్షలతో ఇల్లు..

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే కు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన అభియోగాలపై విశాఖలోని గాజువాక శ్రీనగర్‌కు చెందిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
P.విష్ణుమూర్తి(20)(అలియాస్‌ సాగర్‌)ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఎమ్మెల్యే సందీప్‌ యాదవ్‌కు పలుమార్లు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని,రూ.20 లక్షలు పంపాలని కోరాడు.దీంతో ఆ ఎమ్మెల్యే సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడి బివాడీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిఐ జితేంద్రసింగ్‌ నేతృత్వంలో సిబ్బంది చరవాణి లోకేషన్‌ ఆధారంగా గాజువాక శ్రీనగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ట్రాన్సిట్‌ వారెంట్‌పై నిందితుడిని రాజస్థాన్‌ తీసుకెళ్లారు.సిఎంవొ నుంచి మాట్లాడుతున్నానంటూ విష్ణుమూర్తి అక్కడి ఎమ్మెల్యే లకు ఫోన్‌ చేసి దాదాపు రూ.2.5కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. వారి  నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్‌ క్రైం,కాశీబుగ్గ PS లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో ఇద్దరు మంత్రులు,ముగ్గురు ఎమ్మెల్యేలు నుంచి రూ1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.