home page

ఆదిపురుష్ కి సెన్సార్ ఎలా ఇచ్చారు? బాహెల్ విమర్శలు

 | 
Audipurush
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న భావన కలగలేదని చెప్పినవారూ లేకపోలేదు.
నేపాల్ ప్రభుత్వం సైతం ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీతమ్మతల్లి భారత్‌లో జన్మించినట్లు ఉన్న మాటలను తొలగించాలంటూ  నేపాల్ డిమాండ్ - సీతమ్మ జన్మించిన జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉండటమే దీనికి కారణం. ఆ మాటను Adipurushతొలగించిన తరువాతే తమ దేశంలో ఈ సినిమాను ప్రదర్శించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అటు క్రిటిక్స్ ఆదిపురుష్‌పై చేస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రామాయణాన్ని సమూలంగా మార్చేసేలా ఈ కథను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు. రామాయణాన్ని చివరికి ఓ కల్పిత గాథగా భావించేలా దర్శకుడు ఓం రౌత్ సినిమాను తీశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. బాబు గోగినేని వంటి హేతువాదులు సంధించే విమర్శలు మరో ఎత్తు.
తాజాగా ఆదిపురుష్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సైతం విమర్శలు చేశారు. ఆదిపురుష్ గురించి వార్తల్లో చదివానని, స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నానని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కించపరిచేలా సినిమా ఉందని అన్నారు. ప్రజల భక్తి, విశ్వాసాలతో ఆటలాడుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారాయన.
ఇలాంటి సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం బాధాకరమని భూపేష్ బఘేల్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, హిందువులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరామచంద్రుడిని ఛత్తీస్‌గఢ్ ప్రజలు తమ మేనల్లుడిగా భావిస్తారని, అలాంటి రాముణ్ని అవమానిస్తే సహించబోమనీ తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. దీనికి బాధ్యులైన వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.