home page

గవర్నర్ స్వీట్లు తినిపించడం ఏమిటో... ఇదెక్కడి వింత

శరద్ పవార్ విస్మయం

 | 
Koshitar
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ 
ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు.

నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు. గవర్నర్ తటస్థంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహిరించేటప్పుడు గవర్నర్ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని అన్నారు. గతంలో 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహావికాస్ అఘాడీ నాయకుల ప్రమాణ స్వీకార సమయంలో కొంత మంది మహానేతల పేర్లను స్మరించుకుంటూ ప్రమాణం చేస్తున్నందుకు గవర్నర్ కోష్యారీ అభ్యంతరం తెలిపారని.. అక్కడే ఉన్న నన్ను చూస్తూ, నిబంధనల మేరకే ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారని గుర్తు చేశారు. కానీ ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బాలా సాహెబ్ ఠాక్రే, ఆనంద్ దిఘే పేర్లను ప్రస్తావిస్తే గవర్నర్ అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు.

గతంలో ఎంవీఏ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటా కింద శాసనమండలికి 12 మందిని నామినేట్ చేస్తే గవర్నర్ ఈ జాబితాను ఆమోదించలేదని అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటైన షిండే, బీజేపీ ప్రభుత్వం విషయంలో మాత్రం గవర్నర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులతో వ్యవహరించేటప్పుడు గవర్నర్ తటస్థంగా ఉండాలన్నారు.