home page

జగన్ రెడ్డి రివర్స్ పాలన: జనసేన హరిప్రసాద్

రాష్ట్రంలో జగన్ రెడ్డి రివర్స్ పాలన: జనసేన పి.ఏ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలన తో ప్రజలు అల్లాడుతున్నారని, ఇందులో భాగంగానే నేడు ఉద్యోగుల వంతు వచ్చిందని జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..
 | 
జగన్ రెడ్డి రివర్స్ పాలన: జనసేన హరిప్రసాద్

రాష్ట్రంలో జగన్ రెడ్డి రివర్స్ పాలన:

జనసేన పి.ఏ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలన తో ప్రజలు అల్లాడుతున్నారని, ఇందులో భాగంగానే నేడు ఉద్యోగుల వంతు వచ్చిందని జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు..
శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. జగన్ రెడ్డి రివర్స్ పాలన రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదన్నారు.. ఎన్నికల ప్రచారంలో మాట తప్పను…మడమ తిప్పను అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలు తప్పడమే లక్ష్యం గా పెట్టుకున్నట్లు రాష్ట్ర లో జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు.

జగన్ రెడ్డి రివర్స్ పాలన: జనసేన హరిప్రసాద్

ఎన్నికల ప్రచార సమయంలోనే తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగుల కొన్ని సమస్యలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు… ఉద్యోగులకు పిఆర్పీ పెంపు వల్ల జీతాలు పెరగక పోగా జీతాలు తగ్గడం జగన్ రెడ్డి రివర్స్ పాలనకు నిదర్శనమన్నారు… ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుట్లు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు…

దేవర మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలు పరిష్కరించకుంటే ప్రభుత్వంతగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..

ఆనంద్ మాట్లాడుతూ పాలనను వ్యాపారం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందన్నారు..

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకురాలు ఆకేపాటి సుభాషిణి, నాయకులు దేవర మనోహర్, ఆనంద్, రాజేష్ యాదవ్,హేమ కుమార్,చిన్నా రాయల్ తదితరులు పాల్గొన్నారు.