బాలయ్య కొత్త చిత్రం టీజర్ రిలీజ్
అదిరే స్థాయిలో డైలాగులు
ఎన్బికె 107 టీజర్ విడుదల
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.
ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. దునియా విజయ్ విలన్‌గా చేస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో అలరించబోతోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు జూన్ 10 నబాలయ్య బర్త్‌డే కావడంతో.. ఒకరోజు ముందే ఆయన అభిమానులకు టీజర్ రూపంలో `ఎన్‌బీకే 107` మూవీ టీమ్ ట్రీట్ ఇచ్చింది. విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ఈ టీజర్.. మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది
`నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ – నా జీవో గాడ్స్ ఆర్డర్`, `భయం నా బయోడేటాలోనే లేదు రా బోసేడికే` అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలయ్య మెంటలెక్కించేశాడు. ఆయన లుక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
బాలయ్య బర్త్‌డేకు సరైన్ ట్రీట్ ఇచ్చారంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, ఈ మూవీ అనంతరం బాలయ్య అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. తండ్రీ, కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించబోతోంది.