home page

'సర్కారు వారిపాట' ట్రైలర్ రిలీజ్

అదిరింది మహేష్ బాబు స్టైల్

 | 
Mahesh babu

 ట్రైలర్ ఇలా వుంటే ఇక చిత్రం ఎలా ఉంటుందో?

వావ్..మహేష్ అభిమానుల దేని కోసమై గత మూడేళ్లు గా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ చిత్రం 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

మహేష్ సినిమా అంటే ఏమో అనుకున్నాం కానీ..ఓ రేంజ్ లో చించేశాడు సూపర్ స్టార్. అటు మాస్ ఇటు క్లాస్ రెండింటిని మ్యానేజ్ చేస్తూ.. ఫుల్ గా అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమైపోయాడు మహేష్. ఈ సినిమాని పరశూరాం తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. 

ముఖ్యంగా ఈ సినిమా లో కీర్తి సురేష్-మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ బాగా పడుతాయి అని తెలుస్తుంది. కీర్తి జడలో మల్లెపూలు పెట్టుకోవడం.. దానికి మహేష్ వేసే ఫన్ని కౌంటర్స్ సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. సినిమాలో వెన్నెల కీషోర్ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లోని మహేష్ ప్రతి షాట్ లో పక్కనే వెన్నెల కీషోర్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్‌, టీజర్‌కు మంచి స్పందన రాగా.. కళావతి, ఎవ్రీ పెన్నీ పాటలు అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలో రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. 

ఇక రిలీజ్ అయిన ట్రైలర్ విషయానికి వస్తే..' ఓపెనింగ్ షాట్ నే మహేశ్..'You can steal my LOVE..you can steal my Friend ship But you cant steal my my Money''అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్ టూ రొమాంటిక్ మాటలు కూడా మాట్లాడాడు. ఫన్నీగా కీర్తి సురేశ్‌తో మహేశ్‌ బాబు రొమాన్స్‌ సీన్స్‌ టూ హైలెట్ కానున్నాయి. మరీ ముఖ్యంగా మల్లెపూలు ఫన్నీ డైలాగ్స్‌ నెక్ట్‌లెవల్‌ అని చెప్పొచ్చు. ఇక యాక్షన్‌ సీన్స్‌ పరంగా చూస్తుంటే సూపర్‌ స్టార్ అభిమాలకు ఈ సినిమా ఆకలి తీర్చేస్తుంది అనడంలో సందేహం లేదు. చిత్ర బృందం మంచి ట్రీట్‌ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయేక్తిలేదు. ఈ సినిమాకు థమన్‌ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలిస్తుంది. మే 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. మరి లేట్ ఎందుకు దుమ్ము లేపే మహేష్ మాస్ ట్రైలర్ ను మీరు చూసేయ్యండి..!!