home page

27న విడుదలకు ఎఫ్-3 రెడీ

మంచి ఫన్ చిత్రం: రావిపూడి

 | 
Anil ravipudi

తెలుగులో సీక్వెల్ ఫన్ చిత్రం

సాధారణంగా  సీక్వెల్ చిత్రాలు అనుకున్న విధంగా విజయవంతం కావు. ముఖ్యంగా తెలుగులో సీక్వెల్ చిత్రాలు తక్కువే.ఒరిజినల్ కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని 'ఎఫ్‌-3' బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన 'ఎఫ్‌-2' ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్‌తో ఎఫ్‌3 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ ప్రమోషన్లలో చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా అనీల్ రావిపూడి ఎఫ్‌-3 అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఈ చిత్రం ఒక చార్లీ చాప్లిన్ తరహా విజువల్ ఫన్ అని తెలిపాడు.

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. నిజానికి ఈ చిత్రం గతంలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.