home page

బాలయ్యతో అనిల్ రావిపూడి సరికొత్త చిత్రం కోసం యత్నాలు

కధ విని ఓకే చెప్పిన బాలకృష్ణ

 | 
Balakrishna ravipudi

త్వరలో అనిల్ చిత్రం ఎఫ్ 3 విడుదల

ఎఫ్3 దర్శకుడు అనిల్ రావిపూడికి బాలకృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్టే. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఎఫ్3. ఇక ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో  చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా వెంటనే మొదలు పెట్టాను అని  అనిల్ రావిపూడి చెప్పారు. ఇంతకు ముందే బాలకృష్ణకు కథ చెప్పడం .. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయని రావిపూడి చెప్పారు.imageప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్టు వర్కు కూడా జరుగుతోంది. ఇక ఇందులో బాలయ్యను ఎలా చూపించబోతున్నాడు .. ? సినిమా కథ ఏమిటి ..? అనే విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బాలయ్య బాబు గారి తో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కానీ ఆ అదృష్టం ఇన్నాళ్లకు వచ్చింది.. తండ్రి - కూతుర్ల అనుబంధానికి అర్థం చెప్పే ఒక మంచి కథ తో మీ ముందుకు రాబోతున్నాము. ఇక ఈ సినిమాలో 50 ఏళ్ల తండ్రి పాత్రలో బాలయ్య బాబు కనిపించబోతున్నారు.. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీలా కనిపిస్తుంది..

image

ఇక ఆ తండ్రి తన కూతురితో ఎలా ఉంటాడో . ఆ కూతురు కోసం ఏం చేస్తాడు..? అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ కథ నడుస్తుంది. ముఖ్యంగా కథ వినగానే బాలయ్య బాబు కూడా చాలా ఆసక్తి కనపరిచారు. ఇక ఈ సినిమా చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ సినిమాలో కథ మొత్తం బాలయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఆయన పాత్రను చాలా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరుగుతోంది. అంతేకాదు బాలయ్య లుక్స్ కూడా చాలా డిఫరెంటుగా ఉండబోతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ బాలయ్య బాబు తో ఈ సినిమా ద్వారా సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను .. కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ అనిల్ రావిపూడి తన మనసులో మాటను వెల్లడించారు . మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో లేదో తెలియదు.