home page

విశాఖ ఐఐఎంలో కొత్త కోర్సుల

పీజి సర్టిఫికేట్ కోర్సు కూడా లభ్యం

 | 
Nep

జాతీయ విద్యా విధానం ప్రకారం కోర్సులు

ఐఐఎమ్ విశాఖపట్నం (IIM, Visakhapatnam) ప్రొఫెషనల్స్ కోసం తాజాగా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (IIITDM) కర్నూలుతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ ఇన్ డిజిటల్ లీడర్‌షిప్ ఇన్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ (PGC-DLSM) అనే కోర్సును లాంచ్ చేసింది. ఈ న్యూ ఏజ్ కోర్సును న్యూలెర్న్ (NuLearn) సహకారంతో వన్-ఇయర్ కోర్సుగా తీసుకొచ్చింది. బ్లెండెడ్ లెర్నింగ్ విధానంలో అభ్యర్థులకు ఆఫర్ చేసే ఈ పీజీ ప్రోగ్రామ్‌ ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. న్యూలెర్న్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్రోగ్రామ్‌ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. సంస్థలు సమిష్టిగా అందించే మల్టీడిసిప్లినరీ ప్రోగ్రామ్‌లు, కోర్సులను ఎన్ఈపీ (NEP) ప్రోత్సహిస్తుంది. ఐఐమ్ తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ల కలయిక కావడం విశేషం.

పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌కి కావాల్సిన అర్హతలు

అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ (BE), ఎంఈ (ME) లేదా బీటెక్ (BTech) డిగ్రీని కలిగి ఉండాలి. వారికి కనీసం ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి. ఇప్పటికే మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమ (Manufacturing Industry)లో పని చేస్తున్న నిపుణులు, ప్రధానంగా స్ట్రాటజిక్ (Strategic), మేనేజ్‌మెంట్ రోల్స్ (Management Roles)లో ఉన్నవారు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఏరోస్పేస్, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమోటివ్, మెటల్స్ & మైనింగ్ వంటి పరిశ్రమలలో ప్రొడక్ట్ డిజైన్, మెకానిక్స్, మెటీరియల్స్, సిస్టమ్ డిజైన్ ఫంక్షన్‌లు వంటి ఉద్యోగాలలో ఉన్న ప్రొఫెషనల్స్ పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రాంకి హాజరు కావచ్చు. కెరీర్ మార్చాలని చూస్తున్న వ్యక్తులు కూడా ఈ కోర్సులో నమోదు చేసుకోగలరు.

ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్ 1: న్యూలెర్న్ (NuLearn) అధికారిక అప్లికేషన్ పోర్టల్‌కి వెళ్లండి.

స్టెప్ 2: మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి డీటెయిల్స్ అందించి రిజిస్ట్రేషన్ చేసుకోండి.

స్టెప్ 3: మీ రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ చేయండి. అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయండి.

స్టెప్ 4: అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

స్టెప్ 5: భవిష్యత్ అవసరాల కోసం తప్పనిసరిగా ఫారమ్ ప్రింటవుట్‌ను మీవద్ద ఉంచుకోండి.

ఎంపిక విధానం

లాస్ట్ క్వాలిఫైయింగ్ పరీక్షలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఈ ప్రోగ్రామ్‌కి ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజరు కావాలి. తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులు అభ్యర్థుల మొత్తం పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కోర్సును విప్రో 3డి ల్యాబ్‌లలో అభ్యర్థులు నేర్చుకుంటారు.