home page

త్వరలో అంబాసిడర్ కొత్త అవతార్

ఓల్డ్ గోల్డ్ మెడల్ సంపాదించుకున్న 'అంబాసిడర్ '

 | 
Ambassador

స్టేటస్ సింబల్ అంబాసిడర్ 

`వీల్స్ ఆఫ్ ఇండియా`గా పేరొందిన ఐకానిక్ `అంబాసిడర్‌` కారు రెండేండ్లలో నూతన అవతారంలో భారత్ మార్కెట్లపై పరుగులు తీయబోతున్నది. ఒకనాడు అంబాసిడర్ ఒక స్టేటస్ సింబల్. 

ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ పౌగోట్, హింద్ మోటార్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎంఎఫ్‌సీఐ) పరస్పర సహకారంతో అంబాసిడర్ లేదా `అంబీ` మోడల్ ఇంజిన్‌ను డిజైన్ చేశాయి. త్వరలో మార్కెట్‌లో ఆవిష్కరించబోతున్నారు.

సీకే బిర్లా గ్రూప్ అనుబంధ హెచ్ఎంఎఫ్‌సీఐ నిర్వహిస్తున్న హిందూస్థాన్ మోటార్స్ (హెచ్ఎం) చెన్నై ప్రొడక్షన్ యూనిట్‌లో ఈ నూతన అంబీ కారును ఉత్పత్తి చేస్తారు. అంబీ కారు న్యూ ఇంజిన్ డిజైనింగ్ అడ్వాన్స్ దశకు చేరుకుందని హిందూస్థాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ తెలిపారు. సుదీర్ఘ కాలంగా భారత్ మార్కెట్‌లోకి రావాలని పౌగోట్ ప్రయత్నిస్తున్నది.

1960వ దశకం మొదలు 1990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్‌.. భారతీయులకు ఒక స్టేటస్ సింబల్‌. ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. ఏటా 20 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యే అంబాసిడర్.. 1980వ దశకం మధ్యలోకి వచ్చేసరికి రెండువేలకు పరిమితమయ్యాయి. క్రమంగా అమ్మకాలు పడిపోవడంతో 2013-14లో పూర్తిగా ఉత్పత్తి నిలిపేశారు. ప్రగతిలో ఎత్తు పల్లాలను చూసి చివరకు కనుమరుగైన అంబాసిడర్‌.. ఇప్పుడు అంబీ పేరిట రూపం మార్చుకుని ప్రజల ముంగిట్లోకి వస్తున్నది.

ఇంతకుముందు హిందూస్థాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్ మిత్‌సుబిషి కార్లు తయారు చేసేది. ఉత్తర్‌పారా సైట్ పూర్తిగా అంబాసిడర్ కారు ఉత్పత్తికే వినియోగించేవారు. 2014 సెప్టెంబర్‌లో చివరి అంబాసిడర్ కారును ఉత్పత్తి చేసింది. భారీ రుణాలకు తోడు డిమాండ్ లేకపోవడంతో 2014లో ఉత్పత్తి నిలిపేశారు. అంబాసిడర్ బ్రాండ్‌ను 2017లో హిందూస్థాన్ మోటార్స్ ఓనర్స్ సీకే బిర్లా గ్రూప్‌.. ఫ్రాన్స్ ఆటోమేకర్ పౌగోట్‌కు రూ.80 కోట్లకు విక్రయించేసింది.