home page

5జి స్పెక్ట్రం వేలం లో ఆదానీ

మొబైల్, టెలిఫోన్ రంగంలోకి ఆదాని

 | 
అదానీ
హాలో..హాలో..ఆదాని నెట్వర్క్ వెల్కం!!
***
సెల్ ఫోన్ రంగంలోకి ఆదాని
**
నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, రవాణా వంటి రంగాల్లోకి అమిత వేగంగా దూసుకొచ్చిన ఆదాని గ్రూప్ ఇప్పుడు టెలికాం సర్వీసులు కూడా అందించనున్నది.. ఇక ముందు మన ఫోన్లలో ఆదాని నెట్ వర్క్ కూడా చేరబోతోంది. 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడటం ద్వారా టెలింకంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్నట్లు తేట తెల్లమైంది. ఇప్పుడు అంబానికి పోటీగానో, దీటుగానో ఆదాని కూడా టెలికాం బిజినెస్ చేస్తారన్న మాట. స్పెక్ట్రం వేలం శుక్రవారంతో ముగిసింది. దీనికి మొత్తం నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. అందులో ముగ్గురు పాతకాపులే ఉన్నారు. ముకేశ్ అంబానీకి చెందిన జియో.. సునీల్ మిట్టల్ కు చెందిన ఎయిర్ టెల్.. వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపు సంస్థ కూడా దరఖాస్తు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే..అప్లికేషన్ పెట్టుకున్న వారి పేర్లను అధికారికంగా మాత్రం ఈ నెల 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూపు ఈ మధ్యనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్.. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్సులను తీసుకుంది. ఇక.. స్పెక్ట్రం వేలం విషయానికి వస్తే.. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం ఈ నెల 26న జరగనుంది. దేశీయంగా వ్యాపార దిగ్గజాలైన అంబానీ.. అదానీలు భారీ వ్యాపార సామ్రాజ్యాల్ని స్థాపించినా.. ఈ ఇద్దరు గుజారాత్ వ్యాపారులు ముఖాముఖిన ఒకే వ్యాపారంలో ఢీ కొన్న పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఒకే రంగంలో వీరిద్దరూ పోటీ పడతారు అన్నమాట.