home page

ఉత్తరాంధ్ర ను ఊడ్చేశారుగా :మూర్తి యాదవ్

రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ 

 | 
Moorthy yadav
విశాఖ:
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్:-
వైసిపి ప్రభుత్వం మొదటి నుంచి చేసిన చేష్టలు ఉత్తరాంధ్రని కేంద్ర బిందువుగా చేసిన కుట్ర పరిశీలిస్తే అందరికీ అర్థం అవుతుంది... 
విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి వైసిపి కీలక నేతలు అటు మొదలుపెట్టి భీమిలి, భోగాపురం వరకు తమ దౌర్జన్యాలను భూదందాలను ఏదేచ్చిగా కొనసాగించారు... 
ఉత్తరాంధ్ర పెద్దగా చెప్పుకునే విశారెడ్డి గారు... విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖ నగరం నడిబొడ్డులో ఋషికొండలో పర్యాటక స్థలం, దస్పల్లా భూముల్లో అతిపెద్ద భవనాల సముదాయం... వీటికి పడగలెత్తారు... 
స్వయంగా సీఎం భార్య భారతి ఈ విషయాలను పరిశీలించి ఈ వృద్ధా జంబుకానికి మంగళం పాడి వేరే చోటికి పంపించారు...
అయినా అయ్యగారికి ఆనందం తీరలేదు.. అందుకే.. విస్సన్నపేట భూముల్లో కన్నేశారు...
విస్సన్నపేట 600 ఎకరాల్లో 10% వాటా అంటే 60 ఎకరాలు విజయ్ సాయి రెడ్డి హస్తగతం చేసుకున్నారు... 
విస్సన్నపేట భూములు, ప్రభుత్వ భూములు 29 దళిత కుటుంబాలకి 16 ఎకరాల పట్టాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది... 
రెండు కీలకమైనటువంటి నీటి వనరులు ఆ విస్సన్నపేటలో ఉన్నాయి...
పది అడుగులు ఉన్న రోడ్డుని ఈరోజున 120 అడుగులకు చేర్చి. కొండను పూర్తిగా తొలిచేశారు...
నేను సీఎంను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా విజయ్ సాయి రెడ్డి గారికి విస్సన్నపేటలో 60 ఎకరాలు ఉందని... 
ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతమైతే ఒప్పుకోమని ప్రజావేదికనే కూల్చారు... 
మరి విస్సన్నపేట భూములు ప్రభుత్వ భూములు కావా??? 
మీ ఆర్డీవో స్వయంగా ఇచ్చిన నివేదికలో ఏముంది..
విశాఖపట్నం ఉత్తరాంధ్రను కేంద్రంగా చేసుకుని వైసిపి నేతలు భూదందాలు కొనసాగిస్తున్నారు... 
సీఎం మీకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి భూదందాల మీద ఒక విచారణ చేయించండి... సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయండి... 
వెనుకబడిన ఉత్తరాంధ్రను ఉత్తరాంధ్రలో వనరులను ఇష్టారాజ్యంగా తవ్వుకుని పోతుంటే .. ఉత్తరాంధ్రలో ఎవరు చూస్తూ ఊరుకోం.... 
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడ ప్రజల పొట్టను కొడతానంటే చూస్తూ ఊరుకోం... 
ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికైనా ఈ వైసీపీ దుర్మార్గం అర్థం చేసుకోవాలి...
ఉత్తరాంధ్ర అని పిలిచే రోజులు వచ్చాయి.. ఇప్పుడు మేలుకోకపోతే భవిష్యత్ తరాలకు గజం స్థలం కూడా మిగలదు..
ఉత్తరాంధ్రను పరిపాలన రాజధాని చెప్పి
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పంచిపెట్టేశారు... 
2019 నుంచి 2023 మధ్యలో అటు అనకాపల్లి నుంచి ఇటు భీమిలి వరకు అరకు వరకు భోగాపురం వరకు రియల్ ఎస్టేట్ ఆకాశ హారన్యాలు నిర్మాణాలు చేస్తున్నారు.. 
సుమారుగా లక్ష కోట్ల వ్యాపారం ఈ నాలుగేళ్లలో చేసేసారు.... 
ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు.. సరైన రోడ్లు లేవు.. కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేస్తానంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వరు.. కానీ వ్యాపారానికి కోటానుకోట్లు దండుకుంటున్నారు..
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి ఇస్తానంటే భీమిలి బీచ్ నుంచి భోగాపురం వరకు అడిగారు
అక్కడ స్వయంగా సీఎం ఒక 500 ఎకరాలు, అందరూ కలిసి మరో మూడు వేల ఎకరాలు విజయ్ సాయి రెడ్డి గారు అతిధి గృహాలు ఆ లైన్ లో పెట్టుకున్నారు...
మీ ఇళ్ల కోసం మీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం జాతీయ రహదారులు అడిగే దుస్థితికి వచ్చారు... 
ప్రజల ఏమైపోయినా మీకు పర్వాలేదు, ఉత్తరాంధ్ర నష్టపోయిన మీకు పర్వాలేదు.. మీకు కావలసింది ఇక్కడ భూములు ఇక్కడ మీ వ్యాపారాలు... 
దేశ విదేశాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు.. ఇక్కడ భూముల్లో అక్కడ వారిని కొనుక్కోమంటున్నారు ...
ఋషికొండలో సీఎం బంధువేస్తున్న వెంచర్ ఒక్క గజం 25,000 కి అమ్మేయడం... నిజం కాదా సీఎం చెప్పండి... మీకు తెలియకుండా జరుగుతోందా... 
విస్సన్నపేట ఊరికి రోడ్డు లేదు... కానీ మీ వైసీపీ నేతలు వేస్తున్న వెంచర్ కి రోడ్డు వేసుకున్నారు...
ఈ డీల్ మొత్తం సవ్యంగా చేసినందుకేనా... బొడ్డేడి ప్రసాద్ కి వైకాపా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు... 
రేపు విస్సన్నపేటలో వెంచర్ పూర్తి అయితే మంత్రిస్తారేమో... అందుకేనా విజయసాయిరెడ్డి ఆశీస్సులతో వారి శిష్యుడు గుడివాడ అమర్నాథ్ ఆశీస్సులతో తమరికి 60 ఎకరాలు ఇచ్చారు...
ఎవరు భూమిని ఎవరికి పంచి పెడతారు ఎవరు భూమిని ఎవరికి గిఫ్ట్ లు ఇస్తారు మీ పదవుల కోసం, మీ అనుచరులకు ఉత్తరాంధ్ర భూములే పంచి పెడతారా...?