home page

కేదారినాధ్ యాత్ర నిలిపివేత

 | 
Kedarinadh

ఉత్తరాఖాండ్‌లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి అదేశాలు జారీ చేశారు.

యాత్రికులను అధికారులు సోన్‌ప్రయాగ వద్ద నిలిపివేసిన అధికారులు.. వారు తలదాచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే బయల్దేరిన 5828 మంది యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గడిచిన 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షం కురిసింది. దేహ్రాదూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది.