home page

ఏపీ పై కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక

 | 
Amit shah

ఏపీపై
కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్
చంద్రబాబు సాక్షిగా బయటపెట్టిన అమిత్ షా??


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక హస్తిన పర్యటన తెలుగు రాజకీయాలలో ప్రకంపనలు రేపుతోంది.. ఈ ఒక్క పర్యటనతో ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్… ఉలిక్కిపడ్డారు.. ముఖ్యంగా వైసీపీ హై కమాండ్ కి నిద్రలేని రాత్రులు ఎదురు కాబోతున్నాయనే సంకేతాలు అందాయనే ప్రచారం జరుగుతోంది హస్తినలో. చంద్రబాబుతో అమిత్ షా భేటీ తర్వాత ఏపీ రాజకీయాలలో హీట్ మొదలయింది.. గత నాలుగేళ్లుగా బీజేపీ, వైసీపీ మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణం నడుస్తోందనేది ఓపెన్ సీక్రెట్. కేంద్రంలోని బీజేపీ హై కమాండ్ తో జగన్ కొనసాగిస్తున్న ఈ చీకటి స్నేహానికి నేడో రేపో పాతర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.. తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ తో నీలి మీడియా, కూలి మీడియా వేస్తున్న రంకెలు చూస్తుంటే హస్తిన పిక్చర్ క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు ఎనలిస్టులు..

జగన్ సర్కార్ ఇంటిలెజిన్స్ టీమ్ కి సైతం అందకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ కన్ ఫర్మ్ అయింది.. బాబు హస్తినలో ఎంటర్ అవుతారని ఆయన బయలుదేరే కొన్ని గంటల ముందువరకు కూడా మీడియాకి ఎలాంటి సమాచారం లేదు.. అంత సీక్రెట్ గా సాగింది.. జగన్ నిఘా టీమ్ పూర్తిగా విఫలం అయిందనే చర్చ సాగుతోంది..

జగన్ ఇంటెలిజెన్స్ సంగతి ఎలా ఉన్నా.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ టీమ్ ఏపీ రాజకీయాలపై సంచలన రిపోర్టులు అందుకుందట.. వాటిని చంద్రబాబు సాక్షిగా బహిర్గతం చేశారట అమిత్ షా.. ఏపీలో జగన్ సర్కార్, వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో కనీసం 40-50 స్థానాలు కూడా దక్కే చాన్స్ లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు పంపాయట..

ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యం చెందిందని, మూడు రాజధానుల పేరుతో అమరావతికి అన్యాయం చేయడం, నాలుగేళ్లుగా పోలవరం ఇంచ్ కూడా ముందుకు కదలని పరిస్థితి నుండి పాలనా పరంగా ఏపీ ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం అయ్యాడని కేంద్ర నిఘా వర్గాలు రిపోర్టులు పంపాయట.. అధికార వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కార్ ఆడిన వికృత రాజకీయ క్రీడ ఆ పార్టీ వినాశనానికి దారి తీసేలా ఉందని ఈ రిపోర్టులు నివేదించాయట.. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం, ఇటు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణులను సైడ్ చేసి వాలంటీర్ వ్యవస్థను పెంచి పోషించడం వైసీపీ సర్కార్ కి చరమగీతం పాడేలా ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్ రిపోర్ట్ ఇచ్చిందట.. 

మరోవైపు, దీనికి పూర్తి రివర్స్ లో  ఇటు, టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుండడం కూడా కేంద్ర నిఘా వర్గాలకి సమాచారం అందిందని న్యూ ఢిల్లీ వర్గాల సమాచారం.. జగన్ వేసుకున్న రివర్స్ ఇంజనీరింగ్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, తాడేపల్లి ప్యాలెస్ ని ఇంటికి పంపే రివర్స్ స్కీమ్ ఏపీ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయ్యారనే కేంద్ర నిఘా టీమ్ లు స్పష్టంగా పుంఖాను పుంఖాలుగా రిపోర్టులు ఇచ్చాయని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది.. 

ఈ నివేదికల ఆధారంగానే చంద్రబాబుని కాషాయ దళం నేతలు హుటాహుటిన హస్తినకి రావాలని సందేశాలు పంపారట..  ఈ రిపోర్టులని చంద్రబాబు ముందు చూచాయగా ప్రస్తావించిన అమిత్ షా.. వచ్చే ఎన్నికలలో ఇటు తెలంగాణ, అటు ఏపీలో మరోసారి రెండు పార్టీల పొత్తు అంశాన్ని తెరమీదకు తెచ్చారని భావిస్తున్నారు.. అయితే, ఇది సరయిన సమయం కాదని, ముందుగా ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్ఎస్ తో దూరంగా ఉంటున్నామనే సంకేతాలు పంపాలని, అవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలని సూచించారట చంద్రబాబు.. దీంతో, నేడో రేపో అమిత్ షా టీమ్… బాబు సలహాలు తీసుకోవడానికి సిద్ధం అయిందని తెలుస్తోంది.. అంటే, త్వరలోనే జగన్ కి ఢిల్లీ నుండి మోత మోగడం ఖాయమని సమాచారం.. 

మొత్తమ్మీద, జగన్ కి టఫ్ టైమ్ మొదలయింది.. నాలుగేళ్లకే తన పాలనపై తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న జగన్…. రాబోయే ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి..