home page

రెండు వేల నోట్ రద్దు

మే 25 నుంచి సెప్టెంబర్ 30 మధ్య మార్చుకోవాలి 

 | 
*రూ.2వేల నోట్ల జారీపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం*
రూ.2వేల నోట్లపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
రూ.2వేల నోట్ల నోట్లను చలామణి నుంచి ఆర్‌బీఐ ఉపసంహరించుకోనుంది.
రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా  మర్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. 
2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు  పేర్కొంది. ఒక విడతలో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు.