క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలకు ఆర్బీఐ భారీ జరిమానా
నాలుగు సంస్థలకు చివాట్లు!
Jun 29, 2023, 08:35 IST
|
బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పలు క్రెడిట్ బ్యూరో సంస్థలకు జరిమానా విధించి ఒక ఝలక్ ఇచ్చింది.
నాలుగు సంస్థలకు సమాచారం సగిగ్గా ఇవ్వనందుకు
భారీ జరిమానా విధించింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా సహా ఆర్‌బీఐ పలు క్రెడిట్ స్కోర్ (Credit Score) సంస్థలపై కూడా కొరడా ఝుళిపించింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ వంటి వాటికి షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో వీటికి ఆర్బీఐ (RBI) వీటిని పెనాల్టీ వేసింది.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియాపై రూ. 30 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ బ్యాంక్‌కు పెనాల్టీ వేసినట్లు ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థకు ఆర్‌బీఐ రూ. 26 పెనాల్టీ వేసింది. క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు చెందిన రూల్స్‌ను ఈ సంస్థ అధిగమించడం ఇందుకు ప్రధాన కారణం.
ఇంకా కేంద్ర బ్యాంక్ ఆర్‌బీఐ అలాగే ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థకు కూడా ఝలక్ ఇచ్చింది. సీఐసీ రూల్స్ అతిక్రమన నేపథ్యంలో ఈ కంపెనీకి పెనాల్టీ వేసినట్లు వెల్లడించింది. అలాగే మరో క్రెడిట్ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్‌కు కూడా ఆర్‌బీఐ పెనాల్టీ వేసింది. ఈ సంస్థకు రూ. 24.75 లక్షల వరకు జరిమానా పడింది. సీఐసీ రూల్స్ అతిక్రమణ ఇందుకు కారణంగా పేర్కొంది.
అలాగే సీఆర్ఐఎఫ్ హై మార్క్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సంస్థకు కూడా ఆర్‌బీఐ భారీ షాకిచ్చింది. ఈ సంస్థకు కూడా రూ. 25.75 లక్షల వరకు జరిమానా వేసింది. అలాగే ఆర్‌బీఐ పలు కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా జరిమానా వేసింది. ఉత్తర ప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లక్నో, ఉజ్జీవన్ నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిత్ ఉజ్జీవన్, పనిహటి కోఆపరేటివ బ్యాంక్, బరెహ్మంపూర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒడిశా , సోలాపూర్ సిద్దేశ్వర్ సహకారి బ్యాంక్ సోలాపూర్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగు ఉత్తరపుర కోఆపరేటివ్ బ్యాంక్ పశ్చిమ బెంగాల్ , టెక్స్‌టైల్ ట్రేడర్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అహ్మాదాబాద్ వంటి వాటిపై కూడా జరిమానా పడింది. ఆర్‌బీఐ ప్రతి ఆర్థిక సంవత్సరం తనిఖీలు చేస్తూ వస్తుంది. ఇలా చేసేటప్పుడు బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఏమైనా తప్పులు చేసి ఉంటే తెలుస్తుంది. అప్పుడు ఆర్‌బీఐ వాటికి జరిమానా విధిస్తుంది. ఇంకా కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.