ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్ రెడ్డి

బాబు కళ్లలో నీళ్లు ఎల్లోమీడియా కబుర్లు: జీ శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించడానికి ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోందని వైసిపి నాయకుడు ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరమే అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోడెల మృతదేహం పక్కన మాట్లాడుతుంటే అసలు అతను మనిషేనా అనే అనుమానం కలుగుతోందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడెల బ్రతికి ఉన్నప్పుడు హింసిస్తారు.. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు..ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోను మానసిక వేదనకు గురిచేసి ఆయన శవం పక్కన రాజకీయాలు చేశారు..అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏదో జరిగిపోయినట్లు చెబుతున్నారు అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ దొంగలించడం తప్పుని వర్ల రామయ్యతో చెప్పించారు అలాంటి చంద్రబాబు ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కోడెల చనిపోయిన తరువాత ఐదు ఆరు గంటలకు వరకు చంద్రబాబు మాట్లాడలేదు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభపై కోడెల ఏమైనా లెటర్ రాసారా అని పదే పదే అడిగేవారు..కోడెల ఎలాంటి లెటర్ రాయలేదని తెలిసిన తరువాత చంద్రబాబు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు..అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.