Ashwini DuttPawan KalyanBotsa SatyanarayanaTollywoodAmaravati

బొత్స చెప్పేది ఆయన ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదు: అశ్వినీదత్

  • రాజధానిని మారుస్తామని బొత్స అంటున్నారు
  • ఆయన ఏం చెబుతారో మనకు సరిగా అర్థం కాదు
  • అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ అండగా ఉన్నారు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై సినీ నిర్మాత అశ్వినీదత్ విమర్శలు గుప్పించారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని ఆయన చెబుతున్నారని… అయన భాషే మనకు సరిగా అర్థం కాదని ఎద్దేవా చేశారు. బొత్స చెప్పేది ఆయన ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారని… రాజధాని అంశం ఆయనకు ఏదో బొమ్మలాటలా ఉన్నట్టుందని దుయ్యబట్టారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అంటే రూ. 100 కోట్లు పెట్టుబడి సినిమా తీసేందుకు ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అశ్వినీదత్ అన్నారు. కానీ అవన్నీ వదులుకుని ఆయన ప్రజాజీవితంలోకి వచ్చేశారని చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఆరేళ్ల నుంచి నిలబడ్డారని కొనియాడారు.