asaduddin owaisi,MIM,narendra modi,karnataka

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం: ఒవైసీ

  • మోదీపై వ్యాఖ్యలతో జైలుకు పంపినా వెళతామన్న ఒవైసీ
  • పాతికేళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నానని చెప్పిన ఎంఐఎం చీఫ్
  • చంపేయాలనుకుంటే చంపేసుకోవచ్చని వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు కూడా నేర్పిస్తామని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా వెళతామని వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నానని, తనను చంపేయాలనుకుంటే చంపేసుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానం అని, ముస్లింలకు కాంగ్రెస్ అవసరంలేదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఒవైసీ స్పష్టం చేశారు.

Tags: asaduddin owaisi,MIM,narendra modi,karnataka