prathi adugu pragathi dishaga AP government

డల్లాస్ సభకి అంచనాలకి మించి హాజరైన జనం

Share This

** చరిత్రాత్మకమైన ప్రసంగ **** సభికులుని మంత్ర ముగ్దులుని చేసిన సీఎం గారి ప్రసంగం **
** యన్ ఆర్ ఐ లనుండి అపూర్వ స్పందన **
** యన్ ఆర్ ఐ లకి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలిపిన జననేత **
** సభ రద్దయిందని విష ప్రచారం చేసిన పచ్చ మాఫియా **
** సభ జరుగుతున్న డౌన్ టౌన్ లో స్థానిక సమస్యలమీద ధర్నా జరుగుతుందని , అక్కడకి ఎవ్వరినీ రానివ్వటం లేదని , దానిలో భాగంగా జగన్ గారి సభకూడా రద్దయిందని .. అక్కడకి వెళ్తే ఇబ్బందులు పడతారని కొంతమంది ప్రజలని తప్పుదోవ పట్టించటానికి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసారు .
** అయినా ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అంచనాలకి మించి హాజరవటం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది .

ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైయస్ జగనమోహనరెడ్డి గారు డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది . స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకు దాదాపుగా 9 నుండి 10 వేల మంది వరకూ హాజరైనట్లు సమాచారం . సీఎం గారి ప్రసంగానికి ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులుని అలరించాయి . ముఖ్యంగా ‘ జగనన్నకి స్వాగతం ‘ అంటూ చేసిన పాట అద్భుతంగా ఉంది . ఆ తరువాత వచ్చిన నవరత్నాలు పాటకి కూడా సభికులు హర్షధ్వానాలు చేసారు .

అనంతరం సీఎం జగన్ గారు ‘ i have a dream ‘ అంటూ సాగే మార్టిన్ లూథర్ కింగ్ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించటంతో ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది . దానిని స్ఫూర్తిగా తీసుకొని ‘ నాకు కూడా ఒక కల ఉంది ‘ అంటూ పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలని వివరించటం జరిగింది .

జగన్ గారి మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి రావటంతో సభికులు మంత్ర ముగ్దులై హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు .

**అమెరికన్ పోలీసులని ఆశ్చర్యపరిచిన అభిమానం **

సభకి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అభిమానులని నిలవరించటం పోలీసులకి శక్తికి మించిన పనైంది .

యువకులు ,మహిళలు , చిన్నపిల్లలు , ఆఖరికి వృద్దులు కూడా తమ అభిమాన నేతతో కరచాలనం చేయాలనీ , ఫోటో దిగాలని పదే పదే ముందుకు రావటం పోలీసులని ఆశ్చర్య పరిచింది . వాళ్ళ అభిమానాన్ని అడ్డుకోవటం ఇష్టంలేక ఒకదశలో పోలీసులే కొంతమందికి ఫోటోలు తీసిపెట్టాల్సి వచ్చింది.

ఇంత చిన్న వయస్సులో ఇంతటి అభిమానాన్ని పొందటం అద్భుతమని , పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ ప్రోగ్రాంలలో మాత్రమే ఇలాంటి అభిమానులని చూశామని ..ఆ తరువాత ఒక రాజకీయ నాయకుడికి అలాంటి అభిమానులు ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని స్థానిక పోలీసులు తమ సంతోషాన్ని పంచుకొన్నారు .

ఎయిర్పోర్ట్లో వీడ్కోలు సందర్భంగా స్థానిక అమెరికన్ పోలీసులు అందరూ సీఎం గారిని అడిగి మరీ సెల్ఫీలు తీసుకోవటం విశేషం .

నోట్ :- ఇంతమంది అభిమానులని నిలవరించటం అసాధ్యమని , అమెరికాలోని వివిధ నగరాలతో పాటుగా కెనడా నుండి వచ్చిన అందరితో ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ రద్దయింది . నిర్వాహుకులు ఎంత ప్రయత్నించినా పదివేలమందిని క్యూ లైన్లలో నిల్చోపెట్టటం అసాధ్యమని స్థానిక పోలీసులు మరియు సీఎంఓ అధికారులు తేల్చి చెప్పటంతో ఫోటో సెషన్ రద్దు చేయక తప్పలేదు . జరిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా నిర్వాహుకులు తరుపున క్షమాపణలు చెప్తున్నాను .

Leave a Reply