home page

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు మారుతోంది -వైఎస్సార్ సీపీ

అనర్హత వేటు కోసం పార్లమెంటు సైతం అడ్డుకుంటాం: విజయసాయిరెడ్డి 

 | 
Ysrcp

వైఎస్ ఆర్ సిపి పార్టీ పేరు మార్పు 

గుంటూరు సమీపంలో రెండురోజుల పాటు నిర్వహించిన వైఎస్ ఆర్ సీపీ పార్టీ అర్ధం మారుతోంది. ఇప్పటివరకు ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ సీపీ గా మారుస్తున్నారు.

వైసీపీ నాయకత్వం ఇందుకు అనుగుణంగా  పార్టీ నిబంధనావళిలో మార్పులు తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా తమ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నట్టు ప్లీనరీ రెండో రోజు ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ ఎన్నికల అధికారి హోదాలో ఆయన చేసిన ప్రతిపాదనకు సభలో పాల్గొన్న వారి ఆమోదంతో వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించారు. జగన్ తరపున 22 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అధ్యక్ష పోస్టుకి మరెవరూ నామినేషన్లు వేయలేదని ఆయన ప్రకటించారు.

అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు.

తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఎన్నికల సంఘం వద్ద కూడా పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రస్తావిస్తారు. అది పొడి అక్షరాల్లో వైఎస్సార్సీపీగా ఉంటుంది. తాజాగా ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం ఎన్నికల సంఘం ఈ రెండింటిలో ఏ పేరుకి అంగీకరిస్తే దానినే ఖరారు చేయాలని వైసీపీ భావిస్తోంది.

ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా తదుపరి వైసీపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై కమిషన్ స్పందన చూసిన తర్వాత అవసరమయితే తుది నిర్ణయం ఉంటుందని విజయసాయిరెడ్డి బీబీసీకి తెలిపారు.

ఆర్టికల్ 8, 9 లో చేసిన మార్పులతో అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించిన సవరణల ద్వారా జగన్‌కి జీవితకాల అధ్యక్ష హోదా కట్టబెట్టారు.

ఇక జీవితకాల అధ్యక్ష హోదా కూడా ఇప్పటి వరకూ ఏ పార్టీకి లేదు. దానిని కూడా ఎన్నికల కమిషన్ గుర్తించే అవకాశం లేదని సీనియర్ అడ్వొకేట్ ఎం సుబ్బారావు అన్నారు. గతంలో ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని, నిర్ధిష్ట కాల పరిమితిలో ప్రతీ పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందనే అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

రెండు రోజుల ప్లీనరీ సందర్భంగా మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలిరోజు మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగం, న‌వ‌ర‌త్నాలు- డీబీటీ, వైద్యారోగ్యం తీర్మానాలపై చర్చ జరిగింది. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినట్టు తెలిపారు.