home page

టార్గెట్ అయ్యన్న!! కేసుల ఫైళ్లు సిద్ధం

ఇంటి గోడ కూల్చివేత
 | 

టార్గెట్ అయ్యన్న!!
*
కేసుల ఫైళ్లు సిద్ధం
**
ఇంటి గోడ కూల్చివేత
*
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటింది... ఇన్నాళ్లలో రాష్ట్రానికి  ఏం చేశారయ్యా అంటే ఠక్కున చెప్పేదానికి ఏమీ లేదు కానీ రాజకీయ ప్రత్యర్థులను మాత్రం బాగానే టార్గెట్ చేస్తున్నరు అని ఏమాత్రం సంశయించకుండా చెప్పవచ్చు.. ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులు, పథకాలు..పరిశ్రమలు.. ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో చెప్పలేం కానీ టిడిపి నాయకులు మీద పెట్టిన కేసులు, చేసిన అరెష్టులు అయితే వందలు.. వేలల్లోనే ఉన్నాయి.. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, మాజీమంత్రి నారాయణ, అశోక్ గజపతిరాజు, కోడెల శివప్రసాద్ రావు ఇలా ప్రతి జిల్లానుంచీ ప్రముఖులు, సీనియర్లు పాలనానుభవం ఉన్నవాళ్లు, తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అనిపించినవాళ్ళందర్ని కేసులతో భయపెట్టడం..లొంగదీసుకోవడం సర్వసాధారణం అయింది..ఇక ఇప్పుడు ప్రభుత్వం తాజాగా సీనియర్ నేత, మాజీమంత్రి , నర్సీపట్నానికి చెందిన అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేసింది. మంత్రులు, ముఖ్యమంత్రి పట్ల మర్యాదకరమైన పదజాలం వాడరని , అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ కేసులు బుక్ చేశారు. ఇదిలా ఉండగానే ఆయన ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ఓ వైపు నోటీసులు ఇస్తూనే మరోవైపు ప్రహరీగోడ కూల్చేశారు. నర్సీపట్నంలో

 హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్నను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‎పై అయ్యన్నపాత్రుడు  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను జేసీబీతో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.
అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ సమాచారం రావడంతో ఆయన  అనుచరుల ఆందోళనకు దిగారు. దీంతో కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాకుండా మీడియాకు అనుమతి లేదంటూ  మీడియాను అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లే దారులని పోలీసులు మొత్తం మూసివేశారు. అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన మీద అయ్యన్న భార్య పద్మావతి ఆవేదనతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
ఆమె ఏమన్నారంటే
అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా.. బీసీలుగా పుట్టడమే నేరమా..
 కరెంట్ నిలిపివేసి తెల్లవారు జామున కూల్చివేతకు దిగారు...ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ ఉండాలి...రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటి..మూడు సంవత్సరాల గా ప్రభుత్వం వేధింపులుకు గురిచేస్తోంది . రాష్ట్రంలో కక్ష్య రాజకీయాలతో చంపుతున్నారు మమ్మల్ని చంపండి ..మాకు జీవించే హక్కు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏదీ ఏమైనా గానీ అయ్యన్న జోరును నియంత్రించేందుకు అరెస్ట్ ఒక్కటే మార్గం అని సర్కార్ భవిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేసులతో భయపెట్టి లొంగదీసుకోవడం అనే పాలసీతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది..